మేడ్చల్‌లో దారుణం.. రూ.100 కోసం హత్య

తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో దారుణం జరిగింది. వంద రూపాయల కోసం ఓ వ్యక్తి మరో వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు.

medchal murder

ప్రతీకాత్మక చిత్రం

మేడ్చల్, ఈవార్తలు : తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో దారుణం జరిగింది. వంద రూపాయల కోసం ఓ వ్యక్తి మరో వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. కూలీ డబ్బులు ఇవ్వలేదని ఐరన్ రాడ్‌తో దాడి చేశాడు. దీంతో బాధితుడు స్పాట్‌లోనే మృతిచెందాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌లోని వెంకట్రామిరెడ్డి నగర్ కాలనీకి చెందిన విభూతి పోచయ్య లేబర్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. అతడి వద్ద మహారాష్ట్రకు చెందిన ధర్మేంద్ర కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఓ రోజు ధర్మేంద్రకు పోచయ్య రూ.100 కూలీ తక్కువ ఇవ్వడంతో కోపం పెంచుకున్న నిందితుడు.. మద్యం కోసం రూ.100 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. పోచయ్య ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది.

అనంతరం వారిద్దరు మేడ్చల్‌లోని తుమ్మ చెరువు వద్ద ఉన్న లేబర్ అడ్డాకు చేరుకొని అక్కడ కూడా గొడవ పడ్డారు. కోపోద్రిక్తుడైన ధర్మేంద్ర.. పోచయ్య తలపై ఐరన్ రాడ్‌తో బలంగా కొట్టాడు. పోచయ్య తీవ్ర రక్త స్రావంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే నిందితుడిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్