జమ్మూకశ్మీర్‌లోని కథువాలో ఉగ్ర దాడి.. నలుగురు జవాన్లు వీర మరణం

దేశ సరిహద్దులో జరిగిన ఉగ్ర దాడిలో నలుగురు సైనికులు వీర మరణం పొందారు. సోమవారం జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లా మాచేదీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఆర్మీ కాన్వాయ్‌పై చేసిన ఆకస్మిక దాడిలో మరో ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.

kathua

కథువా, జమ్మూకశ్మీర్

న్యూఢిల్లీ, ఈవార్తలు : దేశ సరిహద్దులో జరిగిన ఉగ్ర దాడిలో నలుగురు సైనికులు వీర మరణం పొందారు. సోమవారం జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లా మాచేదీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఆర్మీ కాన్వాయ్‌పై చేసిన ఆకస్మిక దాడిలో మరో ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులు దాడికి పాల్పడిన వెంటనే.. సైనికులు ప్రతి దాడి చేశారు. అంతలోనే ఈ దారుణం చోటుచేసుకుంది. కథువా జిల్లా కేంద్రం నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రాంతంలో ఆర్మీ గస్తీ నిర్వహిస్తూ ఉంటుంది. ఈ సమయంలోనే ఉగ్రవాదులు ప్లాన్ చేసి దాడికి పాల్పడి ఉంటారని అధికార వర్గాలు అనుమానిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్