ప్రేమ కోసం రెండు నెలల కిందట తండ్రి, తమ్ముడిని నరికి ఫ్రిజ్‌లో దాచిన బాలిక

ప్రేమకు అడ్డుపడుతున్నారన్న కోపంతో పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలిక.. తన తండ్రి, సోదరుడిని అత్యంత దారుణంగా హత్యచేసింది. చంపటమే కాదు.. వారి శరీరాలను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిపెట్టింది.

murder

ప్రతీకాత్మక చిత్రం

క్రైం న్యూస్ : ప్రేమకు అడ్డుపడుతున్నారన్న కోపంతో పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలిక.. తన తండ్రి, సోదరుడిని అత్యంత దారుణంగా హత్యచేసింది. చంపటమే కాదు.. వారి శరీరాలను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిపెట్టింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో చోటుచేసుకుంది. హత్యలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న బాలికను రెండున్నర నెలల తర్వాత పోలీసులు హరిద్వార్‌లో అరెస్ట్‌ చేశారు. రైల్వేలో క్లర్క్‌గా పనిచేసే రాజ్‌కుమార్‌ విశ్వకర్మ కూతురైన ఈ బాలిక..  ఇంటి పొరుగున ఉండే రైల్వే ఉద్యోగి కొడుకు ముకుల్‌ సింగ్‌ (19)ను ప్రేమించింది. గత ఏడాది అతడితో జంప్ అయ్యింది. దీంతో ఆ యువకుడిని పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్ట్‌ చేశారు.

తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన ముకుల్‌ సింగ్‌తో తన ప్రేమకు తండ్రి అడ్డుగా ఉన్నాడని భావించింది. అడ్డు తొలగించుకోవాలంటే చంపాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని ముకుల్ సింగ్‌కు చెప్పడంతో అతడూ సరేనని హత్యకు ప్లాన్ చేశారు. 

ఒక రోజు నిద్రలో ఉండగా, బ్లేడ్‌తో తండ్రిని హత్య చేశారు. ఆ టైంలోనే తమ్ముడు (9 ఏళ్లు) కూడా నిద్రలోంచి లేవటంతో సుత్తితో కొట్టి చంపారు. తర్వాత మృతదేహాలను ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టి పరారయ్యారు. గోవా, బెంగళూరు, ముంబై, యూపీ, పంజాబ్‌లో తిరిగారు. హరిద్వార్‌లో అనుమానాస్పదంగా కనిపించటంతో బాలికను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో తాను హత్య చేసి పరారయ్యానని వెల్లడించింది. ముకుల్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. బాలికను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్