మాస్ సినిమాలు చూసేటప్పుడు లాజిక్స్ వెతక్కూడదు. అలా కాదని ఆరాలు తీయడం మొదలుపెడితే అరగంట కూడా చూడలేం. అర్జున్ సన్నాఫ్ వైజయంతి కూడా అలాంటి కమర్షియల్ సినిమానే.
మాస్ సినిమాలు చూసేటప్పుడు లాజిక్స్ వెతక్కూడదు. అలా కాదని ఆరాలు తీయడం మొదలుపెడితే అరగంట కూడా చూడలేం. అర్జున్ సన్నాఫ్ వైజయంతి కూడా అలాంటి కమర్షియల్ సినిమానే. తెలియని కథ కాదు.. స్క్రీన్ ప్లే కొత్తగా ఏముండదు. అదే జనతా గ్యారేజ్ తరహా టెంప్లేట్ ఫార్ములా సినిమానే. కాకపోతే మదర్ సెంటిమెంట్ బాగా వర్కవుట్ చేసాడు దర్శకుడు ప్రదీప్ చిలుకూరి. స్క్రీన్ ప్లే బాగానే రాసుకున్నాడు.. ముఖ్యంగా విజయశాంతి, కళ్యాణ్ రామ్ సీన్స్ బాగున్నాయి. ఫస్టాఫ్ చాలా వేగంగా వెళ్లిపోయింది. ప్రతీ 10 నిమిషాలకు ఓ యాక్షన్ సీక్వెన్స్ ఉంది. సినిమాలో సీన్స్ తక్కువ.. యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇంటర్వెల్ బ్లాక్ ఆకట్టుకుంటుంది.. బాగా హైప్ ఇచ్చిన క్లైమాక్స్‌లో చిన్న ట్విస్ట్ ఉంది. అదిక్కడ చెప్పడం బాగుండదు. సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది.
అనవసరపు కామెడీ ట్రాక్స్.. లేనిపోని పాటలు ఇరికించకుండా తాను అనుకున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రాపర్‌గా తెరకెక్కించాడు దర్శకుడు ప్రదీప్. వైజయంతిగా విజయశాంతి అద్భుతంగా నటించారు.. ఈ క్యారెక్టర్ ఆమె తప్ప ఎవరూ చేసినా చూడలేం. కళ్యాణ్ రామ్ గురించి కొత్తగా చెప్పేదేముంది.. మాస్ రోల్‌లో రప్ఫాడించాడు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి మదర్ సెంటిమెంట్ కలిపి ప్రాపర్ కమర్షియల్ సినిమా తీసాడు. అక్కడక్కడా డల్ మూవెంట్స్ ఉన్నా.. మాస్ ఆడియన్స్‌కు పర్లేదనిపిస్తుంది ఈ చిత్రం.
ఓవరాల్‌గా అర్జున్ సన్నాఫ్ వైజయంతి.. కొత్తగా లేదు.. అలాగని చెత్తగా లేదు.. కమర్షియల్ బొమ్మ
సమీక్షకుడు: ప్రవీణ్ కుమార్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టు