వరుస సినిమాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మేరకు తన 12వ సినిమా ఫస్ట్ లుక్ ఫొటోను తన సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశాడు.
హైదరాబాద్, ఈవార్తలు : వరుస సినిమాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మేరకు తన 12వ సినిమా ఫస్ట్ లుక్ ఫొటోను తన సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశాడు. ఆగస్టు చివరి నాటికి టైటిల్ రిలీజ్ చేయనున్న ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. నాగ వంశీ-సాయి సౌజన్య నిర్మాణంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 28న విడుదల చేయనున్నారు. ఫస్ట్ లుక్‌లో విజయ్ దేవరకొండ లుక్ భారీ అంచనాలు పెంచేస్తోంది. వర్షంలో ముఖంపై రక్తంతో అరుస్తూ ఏడుస్తున్న ఈ ఫొటోను బట్టి విజయ్ దేవరకొండ తన కొత్త సినిమాలో కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు.
ఫస్ట్ లుక్ ఫొటోను పోస్ట్ చేసిన విజయ్ దేవరకొండ.. అతని కోసం అతడి తలరాత వేచిచూస్తోంది అంటూ కామెంట్ జత చేశాడు. తప్పులు, ప్రశ్నలు, మళ్లీ పుట్టుక అంటూ పోస్ట్ చేశాడు. దీన్ని బట్టి సినిమాలో విజయ్ డబుల్ రోల్‌లో కనిపిస్తాడా? అన్న ప్రశ్న కలుగుతోంది. ఇదిలా ఉండగా, విజయ్ పోస్ట్‌కు పాన్ ఇండియా క్రష్ రష్మిక మందన్నా రిప్లై ఇచ్చింది. ఫైర్ ఎమోజీని జత చేస్తూ విజయ్ పోస్టుకు కామెంట్ పెట్టింది. దీంతో ఫ్యాన్స్ అంతా విజయ్-రష్మిక అంటూ పోస్టులు పెడుతున్నారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఇద్దరు రిలేషిన్ షిప్‌లో ఉన్నారని గత కొంతకాలంగా పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ పుకార్లకు తగ్గట్టే వారిద్దరు పలు సందర్భాల్లో, పలు ఫొటోల్లో ఒకే లొకేషన్‌లో కుటుంబాలతో కలిసి దిగిన ఫొటోలు పోస్ట్ చేయడం గమనార్హం. ఏదేమైనా అమ్మాయిల క్రష్ విజయ్ దేవరకొండ, అబ్బాయిల క్రష్ రష్మిక మందన్నా పెళ్లి చేసుకుంటే చూడాలని చాలా మంది అభిమానులు ఆరాట పడుతున్నారు.