KINGDOM: విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ రివ్యూ..
ప్రతీకాత్మక చిత్రం
చావు తప్పదు అన్నప్పుడు బతకడానికి చంపడం తప్ప మరొక మార్గం కనిపించదు. ఇలాంటి సర్వైవల్ డ్రామాలు మన దగ్గర చాలా వచ్చాయి. కింగ్డమ్ సినిమా కూడా అలాంటి ఒక నాయకుడి కథ. దాన్ని తన స్టైల్ లో చెప్పాడు గౌతమ్ తిన్ననూరి. గత మొదలుపెట్టిన విధానం చాలా బాగుంది. తొలి 20 నిమిషాలు అద్భుతం. ఫస్టాఫ్ వరకు కూడా ఎలాంటి కంప్లైంట్స్ లేవు. కొన్ని సీన్స్ అదిరిపోయాయి. హీరో శ్రీలంక వెళ్లిన తర్వాత వచ్చే యాక్షన్ సీక్వెన్స్ లు బాగున్నాయి. చాలా త్వరగానే తన సామ్రాజ్యంలోకి తీసుకెళ్లాడు గౌతమ్. ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలా బాగుంది. అంత హై ఇచ్చిన తర్వాత సెకండ్ ఆఫ్ ఇంకాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిందే. అసలు సమస్య మొత్తం అక్కడే మొదలైంది. మంచి ఫస్టాఫ్ చూసిన తర్వాత సెకండాఫ్ బాగా స్లో అయింది. చివరి 20 నిమిషాల వరకు నెమ్మదిగానే సాగింది. మళ్లీ క్లైమాక్స్ ఊపు అందుకుంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాకు ప్రధానమైన బలం. శక్తి వంచన లేకుండా నటించాడు. సత్యదేవ్ పాత్ర కూడా చాలా బాగుంది. భాగ్యశ్రీ బోర్సే జస్ట్ ఉంది అంటే ఉంది. అనిరుద్ సినిమాకు బ్యాక్ బోన్. ప్రతి సీన్ డ్యూటీ చేశాడు. టెక్నికల్‌గా ఈ సినిమా టాప్ నాచ్. అసలు పేరు పెట్టడానికి లేదు.
సమీక్షకుడు: ప్రవీణ్ కుమార్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టు