సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ గాయని వాణి జయరాం మృతి

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

|| వాణి జయరాం, Photo: Twitter ||

ఈ వార్తలు, సినిమా న్యూస్‌: చిత్ర పరిశ్రమను విషాదం వెంటాడుతోంది. దర్శక దిగ్గజం, కళాతపస్వి కాశీనాధుని విశ్వనాథ కన్నుమూసిన విషాదాన్ని మరువక ముందే ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం (78) పరమపదించారు. శనివారం చెన్నైలోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆమె కుటుంబ సభ్యులు వివరాలు తెలిపారు. 1945 నవంబర్‌ 30న తమిళనాడులోని వెల్లూరులో జన్మించిన వాణీ జయరాం.. అసలు పేరు కలైవాణి. చిన్నప్పటి నుంచే సంగీత శిక్షణ తీసుకున్న వాణీ జయరాం.. ఎనిమిదో ఏటనే సంగీత కచేరీ నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు. బాలీవుడ్‌లో కెరీర్‌ ప్రారంభించి తెలుగు, తమిళం, మలయాళం, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురీ ఇలా పదికి పైగా భాసాల్లో దాదాపు 8 వేలకు పైగా పాటలు ఆలపించిన వాణీ జయరాం మూడు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ఆమె మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 

పద్మభూషణ్‌ అందుకోకుండానే.. 

సంగీత ప్రపంచానికి వాణీ జయరాం చేసిన సేవలకు గానూ ఆమెకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మ భూషణ్‌ పురస్కారం ప్రకటించింది. దేశంలో మూడో అత్యుత్తమ పౌర పురస్కారాన్ని అందుకుంటుందన్న సమయంలో ఆమె తిరిగి లోకాలకు వెళ్లి అభిమానులను శోకసంద్రంలో ముంచారు. 

ఆ పాటల మాధూర్యాన్ని కొలవగలమా..

తన స్వరంతో అభిమానులను మంత్రముగ్దులను చేసిన వాణీ జయరాం.. క్లిష్టమైన పాటలను సైతం తన గొంతుతో సరళీకరించిన సందర్భాలు కోకొల్లలు. శంకరాభరణంలో ఆమె ఆలకించిన పాటలు ఎవర్‌గ్రీన్‌ హిట్స్‌గా నిలిచిపోయాయి. ముఖ్యంగా ‘దొరుకునా ఇటువంటి సేవ..’, ‘మనస సంచరరె’ పాటలు ఆమెకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. అప్పట్లో కష్టమైన పదాలతో ఉన్న పాటలు పాడాలంటే.. సంగీత దర్శకులెవరైనా వాణీ జయరాంనే ఎంచుకునేవారు. సీతాకోక చిలుక చిత్రంలో ‘మిన్నేటి సూరీడు వచ్చెనమ్మ.’ అన్నా.. మంగమ్మగారి మనవడులో.. ‘శ్రీ సూర్య నారాయణా..’ అన్నా ఆమె స్వరానికి తెలుగు అభిమానులు సాగిల పడిపోయేవారు. 

1970లో ‘గుడ్డీ’ చిత్రం కోసం తొలిసారి గొంతు సవరించుకున్న వాణీ జయరాం.. ఆ తర్వాతి కాలంలో భాష, భావం తేడా రాకుండా వేలాది పాటలు ఆలకించారు. చినుకుల మొదలైన ఆమె పాటల ప్రవాహం ఆ తర్వాత వరదలా మారి.. ఉప్పెనై సినీ అభిమానులను ముంచెత్తింది. అభిమానవంతుడు చిత్రంలో ‘ఎప్పటివలె కాదురా స్వామి’ పాటతో తెలుగుకు పరిచయమైన ఆమె.. ఆ తర్వాత వందల పాటలతో శ్రోతలను అలరించారు. శంకరాభరణం సినిమాలోని ‘మానస సంచరరె’ పాటకు, స్వాతి కిరణంలోని ‘ఆనతి నియ్యరా..’ అనే పాటకు ఆమెకు జాతీయ పురస్కారాలు వరించాయి. తమిళంలోనూ ఒక అవార్డు కైవసం చేసుకున్న వాణీ జయరాం మొత్తం మూడు జాతీయ పురస్కారాలు ఖాతాలో వేసుకున్నారు. ‘ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ’.. ‘ఒక బృందావనం’ వంటి ఎన్నో అద్భుత పాటలు ఆలకించిన ఆమె.. భువి నుంచి దివి కేగారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్