బాలయ్య ఊచకోత.. బాక్సాఫీసు బద్దలు.. కెరీర్‌ హైయెస్ట్‌ ఓపెనింగ్స్‌

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

|| బాలకృష్ణ, Photo: twitter ||ఈవార్తలు, సినిమా న్యూస్‌: ‘గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌’గా సంక్రాంత్రి బరిలో నిలిచిన ‘వీరసింహారెడ్డి’ రికార్డులు బద్దలు కొడుతోంది. నందమూరి నటసింహం బాలకృష్ణ విశ్వరూపం కనబర్చిన ‘వీరసింహారెడ్డి’ తొలి రోజు రికార్డు స్థాయిలో రూ. 54 కోట్లు కలెక్ట్‌ చేసింది. ఇప్పటికే ఎన్నో ఇండిస్ట్రీ హిట్లు ఖాతాలో వేసుకున్న బాలయ్య కెరీర్‌లో తొలి రోజు అత్యధిక కలెక్షన్లు తెచ్చిపెట్టిన సినిమాగా ‘వీరసింహారెడ్డి’ నిలిచింది. పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు, బీభత్సమైన యాక్షన్‌, చెల్లెలి సెంటిమెంట్‌ కలగలిసిన పక్కా మాస్‌ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ తొలి రోజు కలెక్షన్ల వివరాలను సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది.‘పది నిమిషాల్లో మూసే ఏ పబ్‌ దగ్గరికైనా వెళ్లి నిలబడు అక్కడ నీకో స్లోగన్‌ వినిపిస్తుంది’ అన్న బాలయ్య బాబు డైలాగ్‌కు థియేటర్లు మోత మోగుతున్నాయి. కొవిడ్‌-19తో సినీపరిశ్రమ తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్న సమయంలో అఖండతో టాలీవుడ్‌కు కొత్త ఊపు తీసుకొచ్చిన బాలయ్య.. సంక్రాంతికి వీరసింహారెడ్డితో అదే జోరు కొనసాగించాడు. 


ఫ్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్‌తో అన్నా చెల్లెలి సెంటిమెంట్‌తో రూపొందిన ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశాడు. బాలయ్య వీరాభిమాని గోపీచంద్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోగా.. వీరసింహారెడ్డి తొలి రోజే అంచనాలను మించిపోయింది. బాలయ్య పొలిటికల్‌ డైలాగ్స్‌తో థియేటర్లు మారుమోగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా బుర్రా సాయిమాధవ్‌ రాసిన డైలాగ్స్‌ సినిమాకు ప్రత్యేక ఆకర్శణగా నిలిచాయి. బాలకృష్ణ డ్యుయెల్‌ రోల్‌తో పాటు వరలక్ష్మి అభినయానికి ప్రేక్షకులు నిరాజనాలు పడుతున్నారు. బాలయ్యతో సై అంటే సై అన్న విధంగా నటించిన వరలక్ష్మి ఒకప్పటి రమ్యకృష్ణను గుర్తు చేసింది. అయితే పక్కా కమర్షియల్‌ ఫార్మాట్‌లో సాగిన ఈ చిత్రంలో శృతిహసన్‌కు పెద్దగా స్కోప్‌ దక్కలేదు. ఉన్నంతలా ఫర్వాలేదనిపించిన శృతి.. తన యాక్షన్‌తో ఆకట్టుకుంది. ఇక హనీరోజ్‌ తెరపై కనిపించింది తక్కువ సమయమే అయినా.. ఉన్నంతలో బాగా చేసింది. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య తప్ప సంక్రాంతి బరిలో మరో పెద్ద చిత్రం లేకపోవడం కూడా వీరసింహారెడ్డికి కలిసిరానుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్