||విశ్వక్‌సేన్ Photo: Twitter||
ఈవార్తలు, సినిమా న్యూస్: ఫలక్నామా దాస్ సినిమాతో హీరోగా దర్శకుడుగా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నాడు విశ్వక్ సేన్. ఆ తర్వాత హిట్ సినిమాతో మంచి హిట్ కొట్టాడు ఈ కుర్ర హీరో. సినిమాలకంటే ఎక్కువగా తన ఆటిట్యూడ్ తోనే ఈయన ఫేమస్ అయ్యాడు. నన్నెవరూ లేపాల్సినా అవసరం లేదు.. నన్ను నేను లేపుకుంటా అంటూ ఆ మధ్య విశ్వక్ చేసిన కామెంట్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. దానికి తోడు విజయ్ దేవరకొండపై ఇన్ డైరెక్ట్ గా విశ్వక్ చేసిన కామెంట్స్ అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. అదే ఇమేజ్ తో ఇప్పటికి వరుస సినిమాలు చేస్తున్నాడు విశ్వక్. ఈ మధ్య వరుసగా ఫ్లాపులు రావడంతో.. మళ్లీ తానే దర్శకుడిగా మారి ధమ్కీ సినిమా చేస్తున్నాడు ఈ హీరో.
ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమాకు కథ అందించాడు. ఫిబ్రవరి 17న రావాల్సిన ఈ సినిమాను మార్చి 22 కు వాయిదా వేశాడు విశ్వక్. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నందమూరి హీరోలను వాడుకుంటున్నాడు ఈ కుర్ర హీరో. ధమ్కీ ఫస్ట్ లుక్ బాలకృష్ణ చేతుల మీదుగా విడుదలైంది. ఇక ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకురావాలని ట్రై చేస్తున్నాడు విశ్వక్ సేన్. రిలీజ్ కు ఇంకా 20 రోజుల టైం ఉన్న ప్రమోషన్స్ ఇప్పటి నుంచే మొదలు పెట్టాడు ఈ హీరో కమ్ డైరెక్టర్.
పైగా సినిమాకు నిర్మాత కూడా ఆయనే కావడంతో ఎక్కడ ఏ రిస్క్ తీసుకోవడం లేదు. ఎన్టీఆర్ వస్తే కచ్చితంగా సినిమా మైలేజ్ పెరుగుతుందని భావిస్తున్నాడు విశ్వక్. అందుకే ఎలాగైనా తారక్ ను తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఒప్పించాలని ట్రై చేస్తున్నాడు మార్చి 18న హైదరాబాదులోనే ఈ ఈవెంట్ జరగనుంది ప్రస్తుతం తారకరత్న విషాదంలో ఉండిపోయింది నందమూరి కుటుంబం. దాన్నుంచి బయటికి రావడానికి కనీసం మరో 10 రోజులైనా పడుతుంది. అందుకే అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత తన సినిమా ఈవెంట్ పెట్టుకుంటున్నాడు విశ్వక్ సేన్.