టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతి

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||చంద్రమోహన్||

ఈవార్తలు, సినిమా న్యూస్: టాలీవుడ్‌ చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ (82) మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించే అవకాశం ఉంది. కాగా, చంద్రమోహన్ మృతి విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 1942 మే 23న కృష్ణా జిల్లా పమిడిముక్కలలో జన్మించిన చంద్రమోహన్‌ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్‌. బాపట్లలో బీఎస్సీ పూర్తి చేశారు. ఏలూరులో పనిచేశారు. సినిమాల్లో నటించాలన్న ఉత్సాహంతో మద్రాసు వెళ్లి ప్రయత్నాలు ప్రారంభించారు. 1966లో ‘రంగులరాట్నం’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. అప్పటి నుంచి నటుడిగా, సహాయనటుడిగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు. మొత్తంగా 932కిపైగా చిత్రాల్లో నటించారు. హీరోగా 175 సినిమాల్లో చేశారు. కామెడీ పాత్రల ద్వారానే విశేష ప్రేక్షకాదరణ పొందారు. ఆయన నటనకు గానూ రెండు ఫిల్మ్‌ఫేర్‌, ఆరు నంది అవార్డులు వరించాయి.

వెబ్ స్టోరీస్