THE BIRTHDAY BOY REVIEW | బర్త్ డే బాయ్ చనిపోతే.. అనేక మలుపులు తిరిగే కథ

THE BIRTHDAY BOY MOVIE REVIEW | కొన్నిసార్లు ట్రైలర్ చూసి.. కంటెంట్ నచ్చి ఎవరు నటించారు.. ఎవరు తీసారని కూడా చూడకుండా సినిమాలకు వెళ్తుంటాం.. అలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా బర్త్ డే బాయ్.

the birthday boy

ప్రతీకాత్మక చిత్రం

కొన్నిసార్లు ట్రైలర్ చూసి.. కంటెంట్ నచ్చి ఎవరు నటించారు.. ఎవరు తీసారని కూడా చూడకుండా సినిమాలకు వెళ్తుంటాం.. అలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా బర్త్ డే బాయ్. అమెరికాలో ఐదుగురు స్నేహితులు.. అందులో ఒకడి బర్త్ డే. సెలబ్రేషన్స్‌లో భాగంగా వాళ్లు చేసిన రచ్చకు బర్త్ డే బాయ్ చనిపోవడం. అక్కడ్నుంచి కథ అనేక మలుపులు తీసుకోవడం..వినడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉన్న ఇదే లైన్‌తో బర్త్ డే బాయ్ సినిమా వచ్చింది.. చదువుకోడానికి దేశం కాని దేశం వచ్చి ఇలా మర్డర్ కేసులో ఇరుక్కుంటే అనే ఆలోచనే భయంగా ఉంటుంది. అదే భయాన్ని సినిమాలో చాలా బాగా మెయింటేన్ చేసాడు దర్శకుడు విస్కీ. ఫస్టాఫ్ వరకు కథను చాలా వేగంగా నడిపించాడు కూడా. ఎక్కడా టైమ్ వేస్ట్ చేయకుండా తొలి 10 నిమిషాల్లోనే కథలోకి వెళ్లిపోయాడు.
అక్కడ్నుంచి ఒక్కో కారెక్టర్ ఎంట్రీ.. కథలో కలిసిపోవడం వేగంగా జరుగుతుంది. సెకండాఫ్ మాత్రం ల్యాగ్ సీన్స్ ఇబ్బంది పెట్టాయి. చాలా వరకు స్లో నెరేషన్ ఇబ్బంది పెడుతుంది. రన్ టైమ్ 2 గంటలే అయినా.. సెకండాఫ్ స్లో అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మళ్లీ చాలా బాగా తీసాడు దర్శకుడు విస్కీ. బిగ్ బాస్ రవికృష్ణ, రాజీవ్ కనకాల తప్ప అంతా కొత్తోళ్లే.. బాగా నటించారు కూడా.
ఓవరాల్‌గా బర్త్ డే బాయ్.. థ్రిల్ చేస్తుంది.. థియేటర్‌కు మీ తీరిక.. ఓటిటికి అయితే పర్ఫెక్ట్ ఛాయిస్.
సమీక్షకుడు: వడ్ల ప్రవీణ్ కుమార్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టు

సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్