Pekamedalu Movie Review | రియల్ లైఫ్‌ను మించిన కథ ఇంకేదీ ఉండదు. అలాంటి కథలకు ఈజీగానే కనెక్ట్ అవుతుంటాం కూడా. పేకమేడలు సినిమాలో ఇలాంటి కథే చెప్పాడు దర్శకుడు నీలగిరి మామిళ్ళ.
ప్రతీకాత్మక చిత్రం
రియల్ లైఫ్‌ను మించిన కథ ఇంకేదీ ఉండదు. అలాంటి కథలకు ఈజీగానే కనెక్ట్ అవుతుంటాం కూడా. పేకమేడలు సినిమాలో ఇలాంటి కథే చెప్పాడు దర్శకుడు నీలగిరి మామిళ్ళ. డబ్బు కోసం అడ్డదారులు తొక్కే భర్త.. ఇంటిని ఒంటెద్దు బండిలా నడిపే భార్య.. ఈ ఇద్దరి మధ్య సమస్యలు.. ఎప్పుడూ వెక్కిరించే పేదరికం.. ఇలాంటి మిడిల్ క్లాస్ స్లమ్ నుంచి వచ్చిన కథే పేకమేడలు. సినిమా చాలా న్యాచురల్‌గా ఉంది. అక్కడక్కడా బోర్ కొట్టిస్తుంది కానీ.. బాబోయ్ ఏంట్రా ఈ సినిమా మాత్రం అనిపించదు. శ్రీ రామచంద్రులు, క్షేమంగా వెళ్లి లాభంగా రండి లాంటి ఛాయలున్నాయి ఈ సినిమాలో. అలాగే రమ్యకృష్ణ ఆవిడే శ్యామల లైన్ కూడా ఈ సినిమాలో కనిపిస్తుంది. కథను చాలా రియలిస్టిక్‌గా తెరకెక్కించే ప్రయత్నం చేసాడు దర్శకుడు నీలగిరి.
సినిమా అంతా ఒకెత్తు అయితే ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే భార్యా భర్తల ఫైట్ సీన్ మరో ఎత్తు. క్లైమాక్స్ కూడా బాగానే డిజైన్ చేసాడు దర్శకుడు. వినోద్ కిషన్ బాగా నటించాడు. పేకమేడలుకు రియల్ హీరో మాత్రం హీరోయిన్ అనూషా కృష్ణ. ప్రతీ సీన్‌లోనూ జీవించింది ఈ అమ్మాయి.. చాలా బాగా నటించింది. దర్శకుడు నీలగిరి మామిళ్ళ టేకింగ్ ఓకే.
ఓవరాల్‌గా పేకమేడలు.. ఓటిటిలో వచ్చినపుడు హాయిగా చూసే సినిమా
సమీక్షకుడు: వడ్ల ప్రవీణ్ కుమార్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టు
