‘మనం ఫ్రెండ్స్‌ కాదు.. బ్రదర్స్‌ అంతకన్నా కాదు’.. ఆసక్తికరంగా కల్యాణ్‌రామ్‌ అమిగోస్‌ ట్రైలర్‌

evarthalu
ప్రతీకాత్మక చిత్రం


|| ప్రతీకాత్మక చిత్రం ||

ఈ వార్తలు, సినిమా న్యూస్‌: వైవిధ్యభరితమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నందమూరి కల్యాణ్‌ రామ్‌ కొత్త చిత్రం అమిగోస్‌ ట్రైలర్‌ విడుదలైంది. ఈ నెల 10 ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం శుక్రవారం విడుదల చేసింది. రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో కల్యాణ్‌ రామ్‌ మూడు విభిన్న పాత్రల్లో కనించనున్నారు. రక్త సంబంధం లేని ఒకే పోలికతో ఉన్న ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగిన ఆసక్తికర సన్నివేశాలతో ఈ చిత్ర రూపొందించినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. కర్నూల్‌లోని శ్రీరామ థియేటరలో నిర్వహించిన వేడుకలో చిత్ర బృందం ఈ ట్రైలర్‌ను విడుదల చేసింది. 

‘అతడు ఇండియన్‌ పాబ్లో ఎస్కొబా’ అంటూ ఆసక్తికరంగా ప్రారంభించిన రెండు నిమిషాల నిడివగల ట్రైలర్‌ నందమూరి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో కల్యాణ్‌ రామ్‌ మూడు విభిన్నమైన పాత్రల్లో అభిమానులను అలరించనున్నారు. ఇక అలనాటి మేటి గీతం ‘ఎన్నో రాత్రులొస్తాయి గాని.. రాదే వెన్నలమ్మ’ ఈ చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేయనుంది. ట్రైలర్‌లో కామెడీ, లవ్‌తో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్‌, ఎమోషన్‌, ఫైట్స్‌ను సమపాల్లలో మిక్స్‌ చేశారు. ‘మనిషిని పోలిన మనుషులు ఎదురు పడితే అరిష్టం’ అనే డైలాగ్‌ సినిమాపై అంచనాలు పెంచేస్తుండగా.. బింబిసార తర్వాత కల్యాణ్‌రామ్‌ ఖాతాలో మరో హిట్‌ చేరినట్లే అని ఆయన అభిమానులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. 

మైత్రి మూవీ మేక్సర్‌ బ్యానర్‌పై రూపొందించిన ఈ చిత్రంలో అషిక రంగనాథ్‌ కథనాయికగా నటిస్తుండగా.. ఈ చిత్రానికి జిబ్రాన్‌ సంగీత దర్శకత్వం వహించారు. బ్రహ్మాజీ, సప్తగిరి, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రలు పోషించారు. ‘మనం ఫ్రెండ్స్‌ కాదు.. బ్రదర్స్‌ అంతకన్నా కాదు.. జస్ట్‌.. లుక్‌ ఏ లైక్స్‌’ అంటూ కల్యాణ్‌ రామ్‌ పలికిన సంభాషణలు సినిమాపై అంచనాలు మరింతగా పెంచుతున్నాయి. ‘డెవిల్‌ ఇన్‌ ది డార్క్‌’ అంటూ ట్రైలర్‌కు అదిరిపోయే ముగింపు నిచ్చిన చిత్ర బృందం ఈ నెల 10న సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకురానుంది. 

తమ్ముడి బాటలో ఆన్న

గతంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇదే రీతిలో త్రిపాత్రాభినయం చేసిన జై లవకుష చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం నమోదు చేసుకోగా.. ఇప్పుడదే దారిలో అన్న కల్యాణ్‌రామ్‌ అభిమానుల ముందుకు రానున్నారు. కొవిడ్‌-19 ప్రభావం తగ్గిన అనంతరం విడుదలైన బింబిసార.. కల్యాణ్‌రామ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన కల్యాణ్‌రామ్‌.. తన నటనతో మెప్పించాడు. ముఖ్యంగా కృరుడైన బింబిసార చక్రవర్తిగా ‘జగత్‌ జజ్జరిక’ అనే మేనరిజంతో మెప్పించాడు. ఇప్పుడు తాజా అమిగోస్‌ చిత్రంలోనూ ఒక పాత్రలో కల్యాణ్‌రామ్‌ నెగెటివ్‌ రోల్‌ పోషించినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతున్నది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందా తెలియాలంటే వచ్చే శుక్రవారం వరకు వేచి ఉండాల్సిందే.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్