Pushpa-2 Teaser | సినీ ప్రేక్షకులకు మినీ మిల్స్.. టీజర్‌తోనే కేక పుట్టించిన అల్లు అర్జున్

పాన్ ఇండియా ప్రాజెక్టుగా పుష్ప-ది రూల్ పేరుతో రాబోయే రెండో పార్టు కోసం సినీ ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే, నేడు అల్లుగారి అబ్బాయి పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ టీజర్ విడుదల చేశారు. ఆ టీజర్‌లో బన్నీ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.

pushpa the rule
పుష్ప పార్టు 2 Photo: Youtube Screen Shot

Pushpa-2 : పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంత రచ్చ చేశాడో తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని చెప్పినప్పటి నుంచి భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఆ మధ్య రిలీజైన రెండు, మూడు ఫొటోలు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. పాన్ ఇండియా ప్రాజెక్టుగా పుష్ప-ది రూల్ పేరుతో రాబోయే రెండో పార్టు కోసం సినీ ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే, నేడు అల్లుగారి అబ్బాయి పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ టీజర్ విడుదల చేశారు. ఆ టీజర్‌లో బన్నీ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. అమ్మవారి గెటప్‌లో ఫైట్ సీన్ చేస్తున్న టీజర్ మీల్స్ లాగించేముందు సూప్ తాగినంత గొప్పగా ఉంది. బన్నీ బర్త్‌డే కానుకగా అభిమానుల కోసం టీజర్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట దూసుకుపోతోంది.

సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మువీ మేకర్స్ బ్యానర్ తెరకెక్కిస్తున్న ఈ సీక్వెల్ పార్టులో రష్మిక మందన్నా మరోసారి ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. శ్రీవల్లిగా, పుష్ప గాడి భార్యగా అలరించబోతోంది. ఈ మధ్య రిలీజైన రష్మిక ఫొటో కూడా సినిమా లెవెల్‌ను చూపించింది. ఈ సినిమాలో ఫహద్‌ ఫాసిల్, జగదీశ్ ప్రతాప్ బండారీ, జగపతిబాబు, ప్రకాశ్‌‌రాజ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, ధనంజయ, షణ్ముఖ్‌, రావు రమేశ్‌, అజయ్‌, శ్రీతేజ్‌ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.


వెబ్ స్టోరీస్