Bhale Unnade Review | కష్టాల్లో ఉన్న రాజ్ తరుణ్‌కు హిట్ దక్కిందా..!

ఫ్లాపుల్లో ఉన్నపుడు ఒక్కోసారి మంచి సినిమా పడినా పట్టించుకోరు. రాజ్ తరుణ్ పరిస్థితి అలాగే ఉందిప్పుడు. అలాగని భలే ఉన్నాడే అదిరిపోయింది అనట్లేదు కానీ రీసెంట్ సినిమాలతో పోలిస్తే డీసెంట్.

bhale unnade

భలే ఉన్నాడే సినిమా పోస్టర్ Photo: Facebook

ఫ్లాపుల్లో ఉన్నపుడు ఒక్కోసారి మంచి సినిమా పడినా పట్టించుకోరు. రాజ్ తరుణ్ పరిస్థితి అలాగే ఉందిప్పుడు. అలాగని భలే ఉన్నాడే అదిరిపోయింది అనట్లేదు కానీ రీసెంట్ సినిమాలతో పోలిస్తే డీసెంట్. మారుతి టీం ప్రాడక్ట్ కాబట్టే ఈ సినిమాకు వెళ్లా. ఫస్టాఫ్ చూస్తుంటే.. అదేంటి మళ్లీ మారుతి బస్టాప్, ఈ రోజుల్లో కంటెంట్ వైపు వెళ్తున్నాడా అనే డౌట్ వచ్చింది. దర్శకుడు శివసాయి వర్ధన్ తీసుకున్న లైన్ అలాంటిది కాబట్టి అక్కడక్కడా కథకు తగ్గట్లు కొన్నిసార్లు ఓ మోస్తరు లైన్ దాటక తప్పలేదు. బండి కొన్నపుడు టెస్ట్ డ్రైవ్ చేసినట్లే.. పెళ్లికి ముందే అన్నీ తెలుసుకోవాలి అనే కాన్సెప్ట్ కాస్త డోస్ బోల్డ్‌గానే అనిపిస్తుంది. దాన్ని చాలా వరకు డీసెంట్‌గానే డీల్ చేసాడు దర్శకుడు. ఫస్టాఫ్ కొన్ని సీన్స్ బోల్డ్‌గానే అనిపిస్తాయి.. కానీ సెకండాఫ్ మాత్రం ఎమోషనల్‌గా వెళ్లాడు దర్శకుడు.

సింగీతం శ్రీనివాసరావు గారి ఎపిసోడ్, అభిరామి ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్‌లో వచ్చే మదర్ సెంటిమెంట్ సీన్స్ కూడా బాగున్నాయి. ముక్కలు ముక్కలుగా పర్లేదనిపిస్తుంది కానీ కలిపి చూస్తే మాత్రం భలే ఉన్నాడే అనిపించదు. రాజ్ తరుణ్ బాగున్నాడు. రాముడు మంచి బాలుడు పాత్రలో బాగా నటించాడు కూడా. మనీషా కంద్కూర్ కూడా బాగానే నటించింది. అలాగే గ్లామర్ షో కూడా. దర్శకుడు శివసాయి వర్ధన్ రైటింగ్ బాగుంది.

ఓవరాల్‌గా భలే ఉన్నాడే.. అక్కడక్కడా ఏదో ఉన్నాడే గానీ మనస్ఫూర్తిగా చెప్పలేం

సమీక్షకుడు: ప్రవీణ్ కుమార్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టు


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్