క్లాస్.. అదే అనుకొని మోసపోయారు జనం.. నేను చూపిస్తా ఒరిజినల్.. హిట్ 3 చూసిన తర్వాత నాని చెప్పిన ఈ డైలాగు గుర్తొచ్చింది నాకు. ఈ మధ్య మాస్ సినిమాలు చేస్తున్న నాని.. హిట్ 3తో ఎక్స్ట్రీమ్ చూపించాడు.
క్లాస్.. అదే అనుకొని మోసపోయారు జనం.. నేను చూపిస్తా ఒరిజినల్.. హిట్ 3 చూసిన తర్వాత నాని చెప్పిన ఈ డైలాగు గుర్తొచ్చింది నాకు. ఈ మధ్య మాస్ సినిమాలు చేస్తున్న నాని.. హిట్ 3తో ఎక్స్ట్రీమ్ చూపించాడు. ఫస్ట్ టైం కథ కాకుండా హీరో ఇమేజ్ ను నమ్మి సినిమా చేశాడు శైలేష్ కొలను. హిట్ ఫ్రాంచైజీలో వీకెస్ట్ కథ ఇది. కానీ అలాంటి కథను కూడా నాని నడిపించాడు. కనిపించిన ప్రతి సీన్ అదరగొట్టాడు. కేవలం అర్జున్ సర్కార్ కోసమే హిట్ 3 చూడొచ్చు. మామూలుగా హిట్ ఫ్రాంచైజీ అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇందులో అంత థ్రిల్ ఇచ్చే మూమెంట్స్ అయితే లేవు కానీ నాని పర్ఫార్మెన్స్ థ్రిల్ చేస్తుంది. ఫస్టాఫ్ అంతా ఇన్వెస్టిగేషన్ మోడ్ లో వెళ్తుంది. సెకండాఫ్ సర్వైవల్ థ్రిల్లర్. స్క్విడ్ గేమ్ లాగే ఉంది. ఆ సినిమా చూడని వాళ్లకు సెకండాఫ్ యాక్షన్ సీక్వెన్స్ లు పండగే పండగ.
మామూలుగా సైకో థ్రిల్లర్స్ లో ట్విస్టులు ఉంటాయి. హిట్ 3లో అలాంటివి పెద్దగా కనిపించవు. చాలా ఫ్లాట్ గా వెళ్ళిపోతుంది కథ. చివరి 40 నిమిషాలు మాత్రం సినిమా అదిరిపోయింది. హిట్ మల్టీవర్స్ వాడుకున్న తీరు బాగుంది. నాని నటన గురించి ఏం చెప్పాలి.. అర్జున్ సర్కార్ పాత్రలో ఊచకోత కోశాడు. ముఖ్యంగా నాని క్యారెక్టరైజేషన్ బాగుంది. సీరియస్ గా ఉంటూనే అప్పుడప్పుడు నవ్వించాడు. శ్రీనిధి శెట్టి క్యారెక్టర్ ఓకే. శైలేష్ కొలను ఫస్ట్ టైం కథ కంటే ఎక్కువగా బ్రాండ్ వాడుకున్నాడు.
ఓవరాల్ గా హిట్ 3.. థ్రిల్ తక్కువే.. కానీ ఏక్ బార్ ఫర్ అర్జున్ సర్కార్..!
సమీక్షకుడు : ప్రవీణ్ కుమార్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టు