Mathu Vadalara 2 Review | మత్తు వదలరా పార్టు 2 సినిమా మెప్పించిందా..?

బ్రాండ్ అన్నిసార్లు వర్కవుట్ అవ్వదు కానీ కొన్నిసార్లు అవుతుంది. మత్తు వదలరా 2కు ఫస్ట్ పార్ట్ చాలా ప్లస్. ఆ మత్తులోనే సెకండ్ పార్ట్ కూడా అరే ఇదేదో బాగానే ఉందే అనిపిస్తుంది.

mathu vadalara 2

ప్రతీకాత్మక చిత్రం

బ్రాండ్ అన్నిసార్లు వర్కవుట్ అవ్వదు కానీ కొన్నిసార్లు అవుతుంది. మత్తు వదలరా 2కు ఫస్ట్ పార్ట్ చాలా ప్లస్. ఆ మత్తులోనే సెకండ్ పార్ట్ కూడా అరే ఇదేదో బాగానే ఉందే అనిపిస్తుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ అన్నట్లు.. ఫస్ట్ పార్ట్ సూపర్. పార్ట్ 2 దానికి మించి ఎక్స్‌పెక్ట్ చేస్తాం కానీ అంతగా అనిపించదు. అలాగని నిరాశ పరచదు. ఫస్టాఫ్ అంతా నాన్ స్టాప్ కామెడీతో పిచ్చెక్కించాడు సత్య. మనోడు కనిపించిన ప్రతీ సీన్ పేలింది.. వన్ మ్యాన్ షో అంతే. సీన్‌లో ఏం లేదే అనే చోట కూడా సత్య తన పంచులు, ఎక్స్‌ప్రెషన్స్‌తో నవ్వించాడు. హై ఎంటర్‌టైనింగ్ ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్ కాస్త స్లో అయింది. వెన్నెల కిషోర్ నుంచి చాలా కామెడీ ఊహిస్తాం కానీ నిరాశ తప్పదు. అంత హైప్ ఇచ్చిన కారెక్టర్‌ను సెకండాఫ్‌లో నీరు గార్చేసారు. చివరి అరగంట ట్విస్టులు బాగున్నాయి. స్క్రీన్ ప్లే అదిరిపోయింది. పార్ట్ 1ను లింక్ చేస్తూ రాసుకున్న సీన్స్ కూడా ఆకట్టుకుంటాయి. సినిమాలో అన్నీ ఒకఎత్తు అయితే.. ఓరి నా కొడకా ఎపిసోడ్ మరో మత్తు. తెలుగులోనే కాదు.. ఇండియన్ సినిమాలోనే ది బెస్ట్ సీరియల్ రోస్టింగ్ ఇదేనేమో..?

లాజిక్స్ పక్కనబెట్టి చూస్తే మత్తు వదలరా 2 బాగానే నవ్విస్తుంది. శ్రీ సింహా మరోసారి అదరగొట్టాడు. సత్య అయితే ఇరక్కొట్టాడు. ఇంకా చెప్పాలంటే జస్ట్ చంపేసాడంతే. ఫరియా అబ్దుల్లా బాగుంది. స్క్రీన్ ప్రజెన్స్, అలాగే నటన కూడా. సునీల్ ఉన్నా ఆయన ఫుల్ పొటెన్షియాలిటీ వాడుకోలేదేమో అనిపించింది. వెన్నెల కిషోర్, సునీల్ కారెక్టర్స్ ఇంకాస్త వాడుకుంటే అదిరిపోయేది అనిపించింది. ఇందులోనూ చిరు, బాలయ్య రిఫరెన్సులు వాడాడు దర్శకుడు రితేష్ రానా.

ఓవరాల్‌గా మత్తు వదలరా 2.. పార్ట్-1 అంత కిక్ ఇవ్వదు కానీ.. పర్లేదు

సమీక్షకుడు: ప్రవీణ్ కుమార్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టు


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్