||ముక్కా గోమతి రెడ్డి : istagram||
అందానికి, ఆత్మవిశ్వాసానికి ఆర్థిక స్థితి ఎప్పుడు అడ్డు రాదానే విషయాన్ని ఏపీ లో అన్నవయ్య జిల్లా లోని ఓ యువతి జాతీయ స్థాయి అందాల పోటీల్లో పోటీ చేసేందుకు ఎంపికై నిరూపించింది. మార్చి 5వ తేదీన ముంబైలో జరిగే ఫెమినీ మిస్ ఇండియా పోటీల్లో పాల్గొననుంది. చిన్నప్పటి నుంచి అందాల పోటీల్లో పాల్గొంటూ ప్రతి ఒక్క పోటీలో నిరంతరం రాణిస్తోంది. అన్నమయ్య జిల్లాలోని ముక్కావారిపల్లె గ్రామంలో ముక్కా శ్రీనివాసులు రెడ్డి అరుణకుమార్ దంపతులకు కూతురు "ముక్కా గోమతి రెడ్డి". తల్లిదండ్రుల ప్రోత్సాహంతో డిగ్రీలో డిగ్రీ కళాశాలలో అందాల పోటీల్లో పాల్గొని గెలిచింది. తర్వాత సౌత్ ఇండియా మిస్ ఫెమీనా పోటీల్లో పాల్గొని రన్నరప్ అయింది. ఆత్మవిశ్వాసంతో మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి 2023 జనవరి 25 ముంబైలో నిర్వహించిన ఫెమీనా మిస్ అంధ్రా పోటీల్లో పాల్గొని టైటిల్ గెలుచుకుంది. ఇప్పుడు మార్చ్ 5 న మిస్ ఇండియా పోటీల్లో విజయం సాధించి, మిస్ వరల్డ్ సాధించడమే లక్ష్యంగా ముందడుగు వేస్తోంది. ప్రస్తుతం గోమతి రెడ్డి సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.