Kiran Abbavaram Ka Movie Review | మొదటి నుంచి మెల్లగా ఆడి చివరి బాల్ సిక్స్ కొట్టి గెలిపిస్తే ఆ కిక్కు వేరు. క సినిమా విషయంలో కిరణ్ అబ్బవరం ఇదే చేశాడేమో అనిపించింది.
ప్రతీకాత్మక చిత్రం
మొదటి నుంచి మెల్లగా ఆడి చివరి బాల్ సిక్స్ కొట్టి గెలిపిస్తే ఆ కిక్కు వేరు. క సినిమా విషయంలో కిరణ్ అబ్బవరం ఇదే చేశాడేమో అనిపించింది. చివరి 20 నిమిషాలు సినిమాకు ప్రాణం. దాని కోసం సినిమా అంతా చూడొచ్చు అంటే మీరే అర్థం చేసుకోండి క్లైమాక్స్ ఏ రేంజ్ లో ఉందో. అప్పటి వరకు సినిమా చాలా నెమ్మదిగా సాగుతుంది. ఇది మనం చూడని కథ కాదు.. కానీ స్క్రీన్ ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్. చాలా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకున్నారు దర్శక ద్వయం సుజిత్-సందీప్. కాకపోతే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా క్లైమాక్స్ మీద ఉంది. ముందు నుంచి కూడా ఉంటే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉండుంటే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండేది.
ఆసక్తికరంగా మొదలైంది.. మధ్యలో కాస్త స్లో అయింది.. ఇంటర్వెల్ ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ కు పర్ఫెక్ట్ గా గ్రౌండ్ సెట్ అయింది. సెకండ్ ఆఫ్ నెమ్మదిగా మొదలైంది. కాకపోతే కొత్తగా అయితే అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి అసలు మ్యాజిక్ మొదలైంది. అప్పటి వరకు వేసిన చిక్కుముడులు ఆ 15 నిమిషాలలో విప్పేసాడు దర్శకులు. స్టోరీ రొటీన్.. స్క్రీన్ ప్లే దాన్ని కొత్తగా మార్చేసింది. కిరణ్ అబ్బవరం ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాడు. నయన్ సారిక, తన్వి రామ్ ఓకే. సామ్ CS సంగీతం అదిరింది.
ఓవరాల్ గా KA.. అంచనల్లేకుండా వెళ్తే క్లైమాక్స్ 20 నిమిషాలు మతి పోగొడుతుంది.
సమీక్షకుడు : ప్రవీణ్ కుమార్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టు