గోపీచంద్‌కు ఇంకో ఆప్షన్ లేదు.. రామ బాణం లక్ష్యం చేరాల్సిందే..!

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||గోపీచంద్ Photo: Twitter||

ఈవార్తలు, ఎంటర్‌టైన్‌మెంట్: మహాశివరాత్రి సందర్భంగా తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ లుక్స్ చాలానే విడుదలయ్యాయి. దాంతో పాటు కొన్ని సినిమాల టీజర్స్ కూడా విడుదల చేశారు దర్శక నిర్మాతలు. అందులో గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్ లో వస్తున్న రామబాణం సినిమా కూడా ఉంది. శివరాత్రి సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. ఇందులో యాక్షన్ డోస్ ఎక్కువగా ఉందని టీజర్ చూస్తుంటేనే అర్థం అవుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రామబాణం సినిమాను నిర్మిస్తుంది. లౌక్యం తర్వాత విజయం లేని గోపీచంద్ కెరీర్ కు రామబాణం విజయం అత్యంత కీలకంగా మారింది. 

ఆ సినిమాతో 20 కోట్లకు పెరిగిన గోపీచంద్ మార్కెట్ ఆ తర్వాత దారుణంగా పడిపోయింది. ఇప్పటి వరకు ఒక విజయం కూడా రాకపోవడంతో 10 కోట్లు కూడా ఈయన సినిమా వసూలు చేయలేక బాక్సాఫీస్ దగ్గర చేతులెత్తేస్తున్నాయి. అంతెందుకు జిల్ సినిమాకు టామ్ చాలా బాగా వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం రాలేదు. ఇక ఆ తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా గోపీచంద్ మార్కెట్ ను నిలబెట్టలేకపోయింది. గతేడాది భారీ అంచనాల మధ్య విడుదలైన పక్కా కమర్షియల్ కూడా దారుణంగా ఫ్లాప్ అయింది. మారుతి తెరకెక్కించిన ఈ సినిమాతో కచ్చితంగా తాను సూపర్ హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి వస్తానని గోపీచంద్ చాలా నమ్మాడు. కానీ రొడ్డ కొట్టుడు కత్తితో వచ్చిన పక్కా కమర్షియల్ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. 

దాంతో ప్రస్తుతం గోపీచంద్ ఆశలన్నీ రామబాణం సినిమా పైనే ఉన్నాయి ఈయన మాత్రమే కాదు డైరెక్టర్ శ్రీవాస్ కూడా ప్రస్తుత ఈ సినిమా మీద ఆశలు పెట్టుకున్నాడు. ఈయన కెరీర్ గాడిన పడాలన్నా.. మరిన్ని అవకాశాలు రావాలన్నా కచ్చితంగా ఈ సినిమా హిట్ కొట్టాల్సిందే. బాలయ్య చెప్పినట్టు ఈ సినిమాకు రామబాణం అనే టైటిల్ పెట్టారు దర్శక నిర్మాతలు. తాజాగా విడుదలైన టీజర్ కూడా పూర్తిగా యాక్షన్ డోస్ లోనే ఉంది. సమ్మర్ లో సినిమా విడుదలవుతుందని అనౌన్స్ చేశారు మేకర్స్. మరి ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ హిట్టిస్తుందా లేదంటే మరోసారి గోపీచంద్ కు నిరాశ మిగులుతుందో చూడాలి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్