లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరు

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న ఆయన.. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు.

johnny master

జానీ మాస్టర్ Photo: facebook

హైదరాబాద్‌, ఈవార్తలు : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న ఆయన.. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు. మహిళా కొరియోగ్రాఫర్ను వేధించారన్న ఫిర్యాదులో ఆయనపై పోలీసులు పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. ఆయనపై కేసు నమోదు కావడంతో జాతీయ అవార్డు కూడా నిలిపివేస్తున్నట్లు అవార్డుల కమిటీ ప్రకటించింది. ఈ అవార్డు అందుకొనే క్రమంలో గతంలో మధ్యంతర బెయిల్‌ కూడా పొందారు. కానీ, అవార్డును నిలిపివేశారు. ఆ తర్వాత జైలుకు వెళ్లిన ఆయన.. తాజాగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. పోలీసులు సమన్లు జారీ చేసిన వెంటనే విచారణకు హాజరు కావాలని జానీ మాస్టర్‌ను ఆదేశించింది. దీంతో ఈ రోజు రాత్రి లేదా రేపు ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్