O penimiti Song | అద్భుతంగా తెలంగాణ ఫోక్ సాంగ్.. భార్యభర్తల కామెడీ భేష్

O Penimiti Song | తిరుపతి దామెర అందించిన భార్యాభర్తల కామెడీ సాంగ్.. ఓ పెనిమిటి. ఈ పాటలో భార్య పడే బాధ, చిరాకు, ఏడుపు, కోపం, చిలిపి చేష్టలు.. ఇలా అన్నీ ఎమోషన్స్ క్యారీ అయ్యాయి.

o penimiti
ఓ పెనిమిటీ సాంగ్ Photo: Youtube

వరంగల్, ఈవార్తలు : తెలంగాణ ఫోక్ సాంగ్స్‌కు ఉండే క్రేజే వేరు. ఎన్ని పాటలొచ్చినా ఫోక్ సాంగ్స్ యూట్యూబ్‌ను షేక్ చేస్తూనే ఉంటాయి. ఇప్పటి వరకు బతుకమ్మ, తెలంగాణ ఉద్యమం, లవ్ ఫెయిల్యూర్, ఫోక్ డ్యాన్స్.. తదితర పాటలు ప్రజల్లోకి చొచ్చుకుపోయాయి. ఈ మధ్య సినిమాల్లోనూ ఏదో ఒక ఫోక్ సాంగ్ లేకపోతే.. సినిమాకు అంత సీన్‌ లేదు అన్న కామెంట్ వినిపిస్తోంది. అయితే, ఇప్పటి వరకు భార్యాభర్తల మధ్య కామెడీ స్కిట్లు వచ్చినా.. పాటలు అంతగా రాలేదు. ఈ నేపథ్యంలో తిరుపతి దామెర అందించిన భార్యాభర్తల కామెడీ సాంగ్.. ఓ పెనిమిటి. ఈ పాటలో భార్య పడే బాధ, చిరాకు, ఏడుపు, కోపం, చిలిపి చేష్టలు.. ఇలా అన్నీ ఎమోషన్స్ క్యారీ అయ్యాయి. భార్యాభర్తల మధ్య ఉండే చిలిపితనం, కోపాన్నీ అందంగా చూపించారు. వీడియో మేకింగ్, లిరిక్స్ బాగున్నాయి.

ఈ పాటకు తిరు ఫిల్మ్ మేకర్ ఆధ్వర్యంలో మోహన్ మర్రిపల్లి కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించగా, గణేశ్ చెల్పూరి, నిహారిక తిగుళ్ల నటించారు. తిరుపతి దామెర లిరిక్స్ రాయగా, జాన్సీ స్వరం, కేఎన్ఆర్ మ్యూజిక్ అందించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్