హెయిర్ స్టైల్ కొన్నాళ్ల పాటు శాపంగా మారిందని చెప్పిన తాప్సీ.. ఉంగరాల జుట్టు కారణంగా ఎన్నో సినిమా అవకాశాలను కోల్పోయానంది. రింగుల జుట్టు కేవలం యాక్షన్ పాత్రలకే సరిపో తుందని..మిగతా సినిమాలకు పనికి రాదని చాలా అవకాశాలు పోగోట్టుకుందిట.
తాప్సీ
హెయిర్ స్టైల్ కొన్నాళ్ల పాటు శాపంగా మారిందని చెప్పిన తాప్సీ.. ఉంగరాల జుట్టు కారణంగా ఎన్నో సినిమా అవకాశాలను కోల్పోయానంది. రింగుల జుట్టు కేవలం యాక్షన్ పాత్రలకే సరిపో తుందని..మిగతా సినిమాలకు పనికి రాదని చాలా అవకాశాలు పోగోట్టుకుందిట. ఈ క్రమంలో ఛాన్సుల కోసం హెయిర్ ని స్ట్రెయిట్ చేయించినట్లు గుర్తు చేసుకుంది. వాస్తవానికి ఉంగరాల జుట్టు అంటే తనకీ నచ్చేది కాదట. కానీ ఉంగరాల జుట్టు ప్రత్యేకత తెలుసుకుని కాలక్రమంలో ఆ హెయిర్ ని ప్రేమించడం మొదలు పెట్టినట్లు తెలిపింది. ఉంగరాలను ఎలా సెట్ చేసుకోవాలో తెలుసుకుని తెలుసుకుని, నెమ్మదిగా దర్శకులను కూడా దారిలో పెట్టినట్లు పేర్కొంది. కొన్ని నెలల తర్వాత కొంత మంది దర్శకులు ఉంగరాల జుట్టు ఉన్న హీరోయిన్ మాత్రమే కావాలని వాళ్లతోనే అనిపించిందట. సహజంగా ఉండే హెయిర్ గొప్పతనం వారికి చెప్పడంతో చాలా మంది కన్విన్స్ అయ్యారని తెలిపింది. ఇప్పుడు ఉంగరాలు తీసేయాలా? ఉంచాలా? అనే ఆప్షన్ దర్శకులకు ఇస్తుంటే? వద్దు వద్దు ఉంగరాలు లేకపోతే ఎలా? అదే నీ ప్రత్యేకత అంటూ పొగిడేస్తున్నారంది. సినిమాల్లోనే కాదు..కొన్ని బ్రాండ్లు కూడా తన హెయిర్ స్టైల్ చూసి అగ్రిమెంట్లు చేసుకుంటాయని తెలిపింది. ఇప్పుడు ఉంగరాల జుట్టును ఓ వరంగా భావించినట్లు పేర్కొంది.