Shivam Baje Movie Review | హిడింబ హీరో అశ్విన్ బాబు కొత్త సినిమా శివం భజే ఎలా ఉందంటే..

అఖండలో శివయ్య, హనుమాన్‌లో అంజనీ పుత్రుడు, కల్కిలో కృష్ణుడు.. ఇప్పుడు శివం భజేలో ఆ శంకరుడు.. కథలో దేవున్ని కలిపేస్తున్నారు. దర్శకుడు అప్సర్ తీసుకున్న లైన్ చాలా ఆసక్తికరంగా అనిపించింది.

shivam baje movie review

ప్రతీకాత్మక చిత్రం

అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు అంటారు కదా.. మన దర్శకుల ఆలోచన తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఈ మధ్య ఏ సినిమాలో చూసినా ఏదో ఓ దేవుడిని కథలోకి తీసుకొస్తున్నారు. అఖండలో శివయ్య, హనుమాన్‌లో అంజనీ పుత్రుడు, కల్కిలో కృష్ణుడు.. ఇప్పుడు శివం భజేలో ఆ శంకరుడు.. కథలో దేవున్ని కలిపేస్తున్నారు. దర్శకుడు అప్సర్ తీసుకున్న లైన్ చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఆ లైన్ స్క్రీన్ మీదకు వచ్చేసరికి గాడి తప్పింది. అశ్విన్ లాస్ట్ సినిమా హిడింబ మాదిరే.. శివం భజే కూడా కేవలం ఐడియా వరకు అదిరిపోయింది. కథాపరంగా అదిరిపోయిన శివం భజే.. స్క్రీన్ ప్లే లోపాలతో యావరేజ్ దగ్గరే ఆగిపోయింది.

మొదటి 15 నిమిషాలు ఆసక్తికరంగా అనిపించింది. ఆ తర్వాత లవ్ ట్రాక్ పరమ రొటీన్. హీరో యాక్సిడెంట్ సీన్ కూడా జస్ట్ ఓకే. యాక్సిడెంట్ తర్వాత వచ్చే ట్విస్ట్ సూపర్. అక్కడే కథ మలుపు తిరుగుతుంది. మనుషులు కాకుండా అక్కడ్నుంచి కుక్క చుట్టూ కథ తిరుగుతుంది. ఇంటర్వెల్ కార్డ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా పడింది. అక్కడ్నుంచి సెకండాఫ్ గానీ సరిగ్గా పడుంటే శివం భజే మంచి సినిమా అయ్యుండేది.

మర్డర్ మిస్టరీలు.. ముందుగానే అర్థమైపోయే సన్నివేశాలు.. క్లైమాక్స్ వరకు ఎలాగోలా లాక్కొచ్చే సీన్స్‌తో నీరసంగానే సాగింది కథనం. క్లైమాక్స్‌లో మాత్రం ఆ శివుడిని చూపించి కాస్త ఆకట్టుకున్నాడు దర్శకుడు అప్సర్. అశ్విన్ బాబు తన వరకు మరోసారి బాగా చేసాడు. హీరోయిన్ దిగంగన సూర్యవంశీ పర్లేదు. హైపర్ ఆది కామెడీ ఓకే అనిపించింది. అప్సర్ డైరెక్టర్‌గా కంటే రైటర్‌గా సక్సెస్ అయ్యాడేమో అనిపించింది.

ఓవరాల్‌గా శివం భజే.. ఇంట్రెస్టింగ్ ఐడియా.. బోరింగ్ నెరేషన్..

సమీక్షకుడు : ప్రవీణ్ కుమార్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టు


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్