Amaran Movie Review | శివకార్తికేయన్ అమరన్ సినిమా రివ్యూ

ఒక మనిషికి కన్నీళ్లు అంత ఈజీగా రావు. అలా రావాలంటే ఏదైనా ఎమోషన్ కి గట్టిగా కనెక్ట్ అవ్వాలి. అమరన్ సినిమా చూసిన తర్వాత నాకు ఇదే ఫీలింగ్ కలిగింది. ఒక రకమైన ఎమోషన్ తో గుండె బరువెక్కింది. దేశం కోసం ప్రాణం ఇచ్చే ప్రతి సైనికుడి కథ ఆదర్శమే.

amaran movie
ప్రతీకాత్మక చిత్రం

ఒక మనిషికి కన్నీళ్లు అంత ఈజీగా రావు. అలా రావాలంటే ఏదైనా ఎమోషన్ కి గట్టిగా కనెక్ట్ అవ్వాలి. అమరన్ సినిమా చూసిన తర్వాత నాకు ఇదే ఫీలింగ్ కలిగింది. ఒక రకమైన ఎమోషన్ తో గుండె బరువెక్కింది. దేశం కోసం ప్రాణం ఇచ్చే ప్రతి సైనికుడి కథ ఆదర్శమే. అలాంటి ఓ వీర సైనికుడు ముకుంద్ వరదరాజన్. ఆయన జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు రాజ్ కుమార్ పెరియ సామి. సినిమా మేకింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.బహుశా ఇండియాలో వచ్చిన సోల్జర్స్ బయోపిక్స్ లో అమరన్ ది బెస్ట్. కథ మొత్తం కాశ్మీర్ లోనే జరుగుతుంది. అక్కడి పరిస్థితులను, ప్రతీరోజూ సైనికులు పడుతున్న కష్టాలను అద్భుతంగా చూపించాడు దర్శకుడు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లోని 44 RR (రాష్ట్రీయ రైఫిల్స్ 44) గురించి చాలా బాగా చూపించారు.

అమరన్ సినిమాకు ఎమోషన్స్ కీలకం. చాలా సన్నివేశాలు తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తాయి. ఒకవైపు అద్భుతమైన ఆర్మీ యాక్షన్ ఎపిసోడ్స్.. మరోవైపు ఫ్యామిలీ డ్రామా.. అద్భుతంగా బ్యాలెన్స్ చేశాడు రాజ్ కుమార్ పెరియసామి. మేజర్ ముకుంద్ వరదరాజన్ గౌరవాన్ని 100 రెట్లు పెంచే సినిమా ఇది. ఫస్టాఫ్ లవ్ స్టోరీతో గడిచినా.. కీలకమైన సెకండాఫ్ ఎమోషన్స్ తో కంటతడి పెట్టిస్తుంది.సినిమా అంతా ఒకెత్తు అయితే చివరి అరగంట మరో ఎత్తు.ముకుంద్ పాత్రలో శివ కార్తికేయన్ అద్భుతంగా నటించాడనే మాట చాలా చిన్నది అవుతుంది. ఇక సాయి పల్లవి గురించి ఏం చెప్పాలి..? తన ముఖం మాత్రమే కాదు.. కళ్ళు, చూపులు, కన్నీళ్లు అన్నీ నటించాయి. అమరన్ సినిమాకి ప్రాణం సినిమాటోగ్రఫీ. కాశ్మీర్ ను ఇంత అద్భుతంగా చూపించిన ఇండియన్ సినిమా ఇదే అవుతుందేమో. దర్శకుడు రాజ్ కుమార్ పెరియ సామి ఒక అద్భుతమైన సినిమాతో వచ్చాడు.

ఓవరాల్ గా అమరన్.. గుండెను తడిపే ఎమోషనల్ రోలర్ కోస్టర్.. Don't Miss

సమీక్షకుడు : ప్రవీణ్ కుమార్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టు


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్