బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా సాజిద్ నడియావాలా దర్శకత్వంలో కిక్ `2 కి సన్నాహాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. తొలి భాగం `కిక్ భారీ విజయం సాధించడంతో రెండో భాగం కిక్ ను సాజిద్ మరింత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాడు.
కిక్ 2
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా సాజిద్ నడియావాలా దర్శకత్వంలో కిక్ `2 కి సన్నాహాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. తొలి భాగం `కిక్ భారీ విజయం సాధించడంతో రెండో భాగం కిక్ ను సాజిద్ మరింత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ముగింపు దశకు చేరుకున్నాయి. సల్మాన్ తాజా సినిమా నుంచి రిలీవ్ అవ్వగానే పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇందులో హీరోయిన్ ఎంపికన్నది ఆసక్తికరంగా మారింది. మొదటి భాగంలో జాక్వెలిన్ పెర్నాండేజ్ నటించింది. కానీ రెండవ భాగానికి ఆమెని తప్పించి కొత్త నాయిక ను తీసుకునే పనిలో ఉన్నారు. కృతిసనన్, శ్రద్దాకపూర్ లలో ఎవరో ఒకర్ని తీసుకోవాలని సాజిద్ భావిస్తున్నాడుట. ఈ విషయం సల్మాన్ ఖాన్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఎవరి పేరును సజ్జెస్ట్ చేయలేదట. తన ఇష్ట ప్రకారమే ఎంపిక చేయమని ఆబాధ్యత డైరెక్టర్ మీదనే పెట్టేసాడట.