|| ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్, Photo: Twitter ||
దర్శక వీరుడు రాజమౌళి తెరకెక్కించిన టాలీవుడ్ సంచలనాత్మకమైన సినిమా RRR నుంచి 'నాటు నాటు సాంగ్' 95వ ఆస్కార్ నామినిలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేషన్ దక్కించుకుంది. ఈ విషయాన్ని RRR మూవీ టీమ్ ట్వీట్ చేసింది. 'సరికొత్త చరిత్ర సృష్టించాం' అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ పాటకి 'గోల్డెన్ గ్లోబ్' అవార్డు సొంతం చేసుకోగా.. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ అవార్డుని అందుకున్నారు. ఇప్పుడు అదే పాట ఆస్కార్స్ కి నామినేట్ అవ్వడంతో మన భారతీయులంతా ఎంతో గర్విస్తున్నారు.
ప్రపంచం మొత్తాన్ని స్టాప్పు వేసేలా చేసిన ఈ పాట 'నాటు నాటు' సాంగ్ బెస్ట్ 'ఒరిజినల్ సాంగ్' క్యాటగిరీలో నామినేషన్ ని దక్కించుకుంది. దాదాపు 22 ఏళ్ల తర్వాత భారతీయ చిత్రానికి నామినేషన్ దక్కింది. RRR సినిమా దాదాపు రూ.400 కోట్లతో తెలకెక్కించి ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్లకు పైగా రాబట్టింది. అయితే విశ్లేషకులు మాత్రం నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు దక్కుతుందని అంటున్నారు. ఇక ఈ పాట విజయం సాధించడం కోసం మార్చి13వ తేది వరకు ఎదురుచూడల్సిందే..