రీరిలీజ్‌ల నవంబర్

రీరిలీజ్‌ల నవంబర్

rereleasing movies in november telugu

ప్రతీకాత్మక చిత్రం

ఈ మ‌ధ్య ఇండ‌స్ట్రీలో రీరిలీజుల ట్రెండ్ బాగా పెరిగిపోయింది. ఆల్రెడీ రిలీజైన హిట్ సినిమాలు మాత్ర‌మే కాకుండా ఒక‌ప్పుడు రిలీజై ఫ్లాపైన‌, క్లాస్ స్టేట‌స్ తెచ్చుకున్న సినిమాల‌ను కూడా ఇప్పుడు రీరిలీజ్ చేసి దాన్ని నిర్మాత‌లు క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే ఎన్నో సినిమాలు రీరిలీజై మంచి ఫ‌లితాల్ని అందుకోగా న‌వంబ‌ర్ నెల‌లో మ‌రిన్ని సినిమాలు రీరిలీజ్ కాబోతున్నాయి. న‌వంబ‌ర్ నెల‌లో దుల్క‌ర్ స‌ల్మాన్ కాంత‌, ఎన‌ర్జిటిక్ స్టార్ పోతినేని ఆంధ్రా కింగ్ తాలూకా త‌ప్ప చెప్పుకోద‌గ్గ కొత్త సినిమాలేమీ లేక‌పోవ‌డంతో పాత సినిమాలే రీరిలీజుల‌వుతున్నాయి. కాక‌పోతే ఈసారి రీరిలీజులు ఆడియ‌న్స్ కు కాస్త ఇంట్రెస్ట్ ను క‌లిగిస్తున్నాయి. తెలుగు సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లిన శివ సినిమా ఈ నెల 14న రిలీజ్ కానుంది. నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా ఆ రోజుల్లోనే క‌ల్ట్ స్టేట‌స్ ను తెచ్చుకుంది. న‌వంబ‌ర్ 15న ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో సిద్దార్థ్ నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీ రీరిలీజ్ కాబోతుంది. న‌వంబ‌ర్ 21న మెగాస్టార్ చిరంజీవి కొద‌మ‌సింహం రీరిలీజ్ కానుంది. 1990లో మెగాస్టార్ ఫ‌స్ట్ కౌబాయ్ సినిమాగా ఈ సినిమాకు మంచి ఫాలోయింగ్ ఉన్న‌ప్ప‌టికీ క‌మ‌ర్షియ‌ల్ గా మాత్రం భారీ స‌క్సెస్ సాధించ‌లేదు. కానీ త‌ర్వాత్త‌ర్వాత ఈ సినిమాకు మంచి క‌ల్ట్ స్టేట‌స్ వ‌చ్చి, మెగా ఫ్యాన్స్ కు మోస్ట్ ఫేవ‌రెట్ సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. గ‌తంలో ఓ సారి షెడ్యూల్ చేసి పోస్ట్ పోన్ అయిన కార్తీ ఆవారా న‌వంబ‌ర్ 22న త‌మిళ వెర్ష‌న్ తో పాటూ తెలుగులో కూడా రీరిలీజ్ కాబోతుంది. ఆ త‌ర్వాత వారం న‌వంబ‌ర్ 28న సూర్య సికంద‌ర్ డిజాస్ట‌ర్ సినిమాను రీ ఎడిట్ చేసి కొత్త ఆడియ‌న్స్ కు స‌రికొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా ఆ మూవీని రీరిలీజ్ చేస్తున్నారు. ఇక నెలాఖ‌రుకి సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు బిజినెస్ మ్యాన్ న‌వంబ‌ర్ 29న రిలీజ్ కానుంది.


భారత్‌-దక్షిణాఫ్రికా టెస్టుకు భారీ భద్రత
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్