మాకు కొత్తదనం వద్దు.. పరమ రొటీన్ అయినా పర్లేదు అనుకుంటే మిస్టర్ బచ్చన్ మెప్పిస్తాడు. ఫ్యాన్స్ కోసం ఫస్ట్ హాఫ్ అంతా వింటేజ్ రవితేజను చూపించాడు హరీష్ శంకర్.
మిస్టర్ బచ్చన్ సినిమా రివ్యూ
మాకు కొత్తదనం వద్దు.. పరమ రొటీన్ అయినా పర్లేదు అనుకుంటే మిస్టర్ బచ్చన్ మెప్పిస్తాడు. ఫ్యాన్స్ కోసం ఫస్ట్ హాఫ్ అంతా వింటేజ్ రవితేజను చూపించాడు హరీష్ శంకర్. కథకు అస్సలు సంబంధం లేని హీరో, హీరోయిన్ ట్రాక్ ఇది. నో లాజిక్ అనుకుంటే బాగా ఎంజాయ్ చేస్తారు. అదేంటి ఆ సీన్ అని బుర్రకు పని చెప్తే ఆఫ్ అయిపోతారు. జస్ట్ గో విత్ ఫ్లో అనుకోవాలి. అప్పుడే బచ్చన్ నచ్చుతాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో హిందీ పాటలు ఎక్కువయ్యాయి. ఆ ప్లేస్ లో తెలుగు పాటలు పెట్టుంటే థియేటర్ ఊగిపోయేది. అసలు కథ సెకండ్ హాఫ్ లోనే ఉంది. స్టోరీ అంతా ఒకేచోట జరుగుతుంది కాబట్టి బోర్ కొట్టకుండా చాలా జిమ్మిక్కులు చేశాడు హరీష్. అందులో కొన్ని ఫ్యాన్స్ కి కిక్ ఇస్తాయి కూడా. రవితేజ, జగపతి బాబు మధ్య సీన్స్ బాగున్నాయి. ఓ యంగ్ హీరో కేమియో కూడా ఉంది ఈ సినిమాలో. అది అదిరిపోయింది.
నిజానికి రెయిడ్ కథలో కమర్షియల్ కోణం లేదు. డ్రై సబ్జెక్ట్ అది. పాయింట్ నచ్చి తీసుకున్నాడు హరీష్ శంకర్. కమర్షియలైజ్ చేయడానికి తనవంతు ప్రయత్నం చేశాడు దర్శకుడు. అందులో కొంతవరకు సక్సెస్ అయ్యాడు హరీష్ శంకర్. రవితేజకి ఈ క్యారెక్టర్ కొట్టిన పిండి. ఇరక్కొట్టాడు. భాగ్యశ్రీ బోర్సే మిస్టర్ బచ్చన్ కు ప్లస్. ఆమె గ్లామర్ నెక్స్ట్ లెవెల్. సత్య, చమ్మక్ చంద్ర కామెడీ ఓకే. పాటలు బాగున్నాయి. చూడ్డానికి.. వినడానికి కూడా. హరీష్ శంకర్ మార్క్ అక్కడక్కడా కనిపించింది.
ఓవరాల్ గా మిస్టర్ బచ్చన్.. బాగా రొటీన్.. కానీ మరీ బోరింగ్ కాదు.
సమీక్షకుడు : ప్రవీణ్ కుమార్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టు