Rashmika Mandanna | రష్మిక మందన్నాకు ఆరోగ్య సమస్యలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ వైరల్

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||రష్మిక మందన్నా Photo: Instagram ||

ఈవార్తలు, ఎంటర్‌టైన్‌మెంట్: పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ సాధించిన టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన్నా ఆరోగ్య సమస్యలతో బాధపడుతోందా? అంటే అవుననే అనుమానాలు వస్తున్నాయి. సాధారణంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. తను చేసే పనులను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా.. తాజాగా తన షెడ్యూల్‌ను స్టోరీగా పెట్టింది. డియర్ డైరీ.. అంటూ మొదలుపెట్టి.. ‘ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్‌గా గడిచింది. నిద్ర లేచి కాసేపు కార్డియో వ్యాయామం చేశా. భోజనం చేసి రేపటి షెడ్యూల్‌ కోసం బ్యాగ్‌ సర్దుకున్నా. కానీ ఎప్పటిలాగే వాతావరణం, మంచు నా పనులను ఆపేశాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా చేశాయి. బ్యాగు సర్దుకోవడం అయ్యాక డిన్నర్‌ చేసేశా. వాస్తవానికి ఈ రోజు చాలా ముఖ్యమైన మీటింగ్ ఉండే. డెర్మట్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ తీసుకున్నా. కానీ క్యాన్సిల్‌ అయ్యింది. అందుకే ఇంటికి వచ్చేశా. గుడ్‌ నైట్’ అని పేర్కొంది. ఐ లవ్యూ ఆల్‌.. స్లీప్‌ వెల్‌ అంటూ హార్ట్‌ ఎమోజీలనూ జత చేసింది. 

అయితే, డెర్మట్ అన్న పదం వాడటంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. డెర్మట్ అంటే డెర్మటాలజిస్ట్ అని.. రష్మికకు చర్మ సమస్యలు వచ్చాయా? అని సందేహపడుతున్నారు. రష్మికకు ఏమైంది? ఎలాంటి చర్మ సమస్యలు వచ్చాయి? డెర్మటాలజిస్ట్‌ను కలిసే అంత సీరియస్ ఉందా? అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రష్మిక ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి. కాగా, రష్మిక లవ్ ఎఫైర్‌పైనా జోరుగా కామెంట్లు వస్తున్నాయి. విజయ్ దేవరకొండతో డీప్ లవ్‌లో ఉందని అంటున్నారు. ఈ మధ్యే వీరిద్దరు దుబాయ్‌లో చక్కర్లు కొట్టిన ఫొటోలు నెట్టింట్లో హల్‌చల్ చేయడమే ఇందుకు కారణం. అయితే, తామిద్దరం ఫ్రెండ్స్ మాత్రమేనని ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్