అన్నిటిని ఎదుర్కొనేందుకు సిద్ధపడే ఇండస్ట్రీకి వచ్చా.. రాశి ఖన్నా

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||రాశి ఖన్నా : instagram||

రాశి ఖన్నా తెలుగు ఇండస్ట్రీలో 2014 లో రిలీజ్ అయిన  ఉహలు గుసగుసలాడే సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తెలుగు తో పాటు తమిళ్ ఇండస్ట్రీలో సినిమాలు చేసిన సినిమాలు విజయం సాధించడం కంటే ఎక్కువగా పరాజయం సాధించాయి. అయినా ఏమాత్రం విశ్వాసం కోల్పోకుండా బాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది ఈ ముద్దుగమ్మ. బాలీవుడ్ లో వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను అలరించి మంచి సక్సెస్  సొంతం చేసుకుంది. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రావడంతో ఈ భామకు ఇప్పుడు సినిమా అవకాశాలు భారీగా వస్తున్నాయి. సిద్ధార్థ మల్హోత్రా హీరోగా సాగర్ అంబ్రే, పుష్కర్ ఓజా దర్శకత్వంలో "యోధ" సినిమాలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా జూలై 7న విడుదల చేయనున్నట్టు సినీ బృందం ప్రకటించింది. ఇక ఈ సినిమా కూడా సక్సెస్ అయితే రాశి కన్నా కెరియర్ లో ఇంకా ఎన్నో సినిమాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో రాసి కన్నా తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. తన కెరీర్లో మొదటి సినిమా మద్రాస్ కేఫ్ సినిమాలో నటనపై ఎలాంటి అవగాహన లేదన్నారు. ఇక తెలుగు ఇండస్ట్రీకి వచ్చాక నటనపై ఓ పట్టు సాధించానని అప్పటినుండి ముందు అడుగు వేస్తూనే వస్తున్నానంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. మొదట్లో తనకు ప్లాస్ రావడంతో ఎన్నో ట్రోల్స్, విమర్శలు ఎదుర్కొన్నాను అంటూ బాధపడింది. అయితే ఈ విమర్శలను, ట్రోలింగ్స్ ను లెక్కచేయకుండా వాటన్నింటినీ ఎదుర్కునేందుకు సిద్ధపడే ఇండస్ట్రీలోకి వచ్చాను అంటూ రాశి  ఇంటర్వ్యూలో తెలిపింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్