'కాంత'పై లీగల్ ఫైట్.. రంగంలోకి రానా!
ప్రతీకాత్మక చిత్రం
దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి కాంబోలో వస్తున్న 'కాంత' సినిమా రిలీజ్‌కు సరిగ్గా రెండు రోజులు ఉందనగా లీగల్ టెన్షన్ మొదలైంది. ఈ సినిమా 1950ల నాటి తమిళ లెజెండరీ సూపర్ స్టార్ ఎం.కె. త్యాగరాజ భాగవతార్ బయోపిక్ అని, అందులో ఆయన్ను చాలా తప్పుగా, అనైతికంగా చూపించారంటూ.. ఆయన మనవడు చెన్నై కోర్టులో పిటిషన్ వేశాడు. సినిమాను వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేయడంతో కోలీవుడ్‌లో కలకలం రేగింది. ఈ డ్యామేజ్‌ను కంట్రోల్ చేయడానికి ఇప్పుడు ప్రొడ్యూసర్ రానా దగ్గుబాటి స్వయంగా రంగంలోకి దిగాడు. ఈ లాస్ట్ మినిట్ ఫైర్‌ను ఆపడానికి రానా, 'కాంత' టీమ్ నుంచి అఫీషియల్ క్లారిటీ ఇచ్చేశాడు. ఈ సినిమా ఏ ఒక్కరినీ టార్గెట్ చేయడం లేదని స్పష్టం చేశాడు. "మేము ఎవరినీ టార్గెట్ చేయడం లేదు.. కాంత ఒక కల్పిత కథ" అంటూ రానా అఫీషియల్ హ్యాండిల్ నుంచి ట్వీట్ చేశాడు ఈ ఒక్క స్టేట్‌మెంట్‌తో, ఇది బయోపిక్ కాదని, కాబట్టి ఎవరి పర్మిషన్లూ అవసరం లేదని లీగల్‌గా సేఫ్ అయ్యే ప్రయత్నం చేశారు.