Game Changer Review | రాంచరణ్, శంకర్‌ల కాంబో సినిమా గేమ్ ఛేంజర్ ఎలా ఉందంటే..

ఒక నిజాయితీ కలిగిన అధికారి.. వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపిస్తాడనేదే గేమ్ ఛేంజర్ స్టోరీ. సామాజిక కార్యకర్త, ఐఏఎస్ ఆఫీసర్‌గా రెండు పాత్రల్లో రామ్ చరణ్ ఒదిగిపోయాడు. నటనలో తన పరిణతిని చూపెట్టాడు.

game changer review

గేమ్ ఛేంజర్ సినిమా Photo: Twitter

శంకర్ సినిమాలు అనగానే.. నిజాయితీ కలిగిన వ్యక్తి వ్యవస్థపై, వ్యవస్థతో పోరాడటమే కనిపిస్తుంది. సేమ్ గేమ్ ఛేంజర్ సినిమా కూడా అంతే. ఒక నిజాయితీ కలిగిన అధికారి.. వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపిస్తాడనేదే గేమ్ ఛేంజర్ స్టోరీ. సామాజిక కార్యకర్త, ఐఏఎస్ ఆఫీసర్‌గా రెండు పాత్రల్లో రామ్ చరణ్ ఒదిగిపోయాడు. నటనలో తన పరిణతిని చూపెట్టాడు. సినిమా కోసం ప్రాణం పెట్టాడు. ఎస్‌జే సూర్య విలనిజం అద్భుతం. మరోసారి విలన్ పాత్రలు తనకు ఎందుకు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతాయో చూపించాడు. రాజకీయ నాయకుడి పాత్రలో సూపర్‌గా నటించాడు. సాంకేతికంగా చూస్తే కథ, కథనం, నటీనటుల పర్ఫార్మెన్స్ బాగున్నాయి. ఇక.. నటీమణులు కియారా అద్వానీ, అంజలి తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాలో పాటలు, విజువల్స్ నెక్స్ట్ లెవల్. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ రాణిస్తుంది. అయితే, సంక్రాంతి బరిలో ఎలా నెట్టుకొస్తుందనేదే క్వశ్చన్.

సినిమాల హైలైట్స్: 

ఎస్‌జే సూర్య యాక్టింగ్, ఇంటర్వెల్ బ్యాంగ్, జరగండి జరగండి సాంగ్

మైనస్‌లు:

రొటీన్ స్టోరీ, మాస్ ఎలివేషన్ సీన్స్ లేకపోవడం, వర్కౌట్ కాని కామెడీ, బోర్ కొట్టించే క్లైమాక్స్ ఫైట్

ఒక్క మాటలో.. డైరెక్టర్ శంకర్ సినిమా పాటలకే పరిమితం అయ్యింది. 

రేటింగ్ : 2.75/5


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్