ఆస్కార్ వేదికపై రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్‌కు చేదు అనుభవం.. దక్కని ఉచిత ఎంట్రీ పాసులు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ఎన్టీఆర్, రాజమౌళి, రాంచరణ్ Photo: twitter||


అమెరికాలోని లాస్ ఏంజిల్స్‏ డాల్బీ థియేటర్‏లో 95 ఆస్కార్ వేడుకల్లో RRR సినిమాలోని "నాటు నాటు" పాటకు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్  విభాగంలో అవార్డు అందుకుని టాలీవుడ్ సత్తాను చాటారు. అయితే ఈ ఆస్కార్ వేడుకల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళికి చేదు అనుభవం ఎదురైంది. అయితే ఈ టాపిక్ సోషల్ మీడియాలోనూ.. సినీ ఇండస్ట్రీలోనూ వైరల్ గా మారింది. ఈ వేడుకలో ఎంఎం కీరవాణి, చంద్రబోస్ లకి మాత్రమే అకాడమీ వేడుకల్లో ఉచిత టికెట్ ఇచ్చారట.. రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళికి  ఈ వేడుకల్లో పాల్గొనేందుకు సుమారు $25 వేల డాలర్లతో టికెట్టు తీసుకోవాల్సి వచ్చిందట. అంటే మన ఇండియా కరెన్సీలో రూ. 20.6 లక్షలు పెట్టి రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లతోపాటు ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన రాజమౌళి భార్య రమ, కొడుకు కార్తికేయ, ఈయన భార్య పూజా, కీరవాణి భార్య శ్రీవల్లి, ఉపాసన, సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాళ భైరవ అందరికీ రాజమౌళి టికెట్ కొనుగోలు చేశారట.. కాగా, ఈ వేడుకల్లో రాజమౌళితో పాటు సినీబృందం వెనుక వరుసలో కూర్చోబెట్టినందుకు అకాడమీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అలాగే నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. RRR సినీ బృందం ఆస్కార్ అవార్డును గెలిచి తిరిగి హైదరాబాదుకు రావడంతో సినీ బృందానికి ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం పలికారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్