Pushpa 2 Trailer Date | పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది..

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

pushpa 2 trailer

ప్రతీకాత్మక చిత్రం

ఈవార్తలు, టాలీవుడ్ : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే, ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్‌కు చిత్ర బృందం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ట్రైలర్‌ను లాక్ చేసినట్లు ప్రకటించిన చిత్ర బృందం.. తాజాగా రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. ఈ నెల 17న సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు పాట్నాలో నిర్వహించే ఈవెంట్‌లో ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ట్రైలర్‌ ప్రస్తుతం భారతీయ చలన చిత్ర రంగంలోనే కొత్త రికార్డులను క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

కాగా, పుష్ప 2 సినిమా తొలి రోజే రూ.270 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే డిజిటల్ రైట్స్‌ను ఓ సంస్థ భారీ మొత్తంతో దక్కించుకుంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలై.. పాన్ ఇండియా లెవెల్‌లో ఊహించనన్ని కలెక్షన్లు సాధించడం పక్కా అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అల్లు అర్జున్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉందని, అక్కడ కొత్త రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని చెప్తున్నారు.

ఇక, ఉత్తరాదిన కూడా అల్లు అర్జున్ మాస్ యాక్షన్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోతారని చిత్ర బృందం ఆశిస్తోంది. పుష్ప 1 లో.. తగ్గేదేలే అన్న డైలాగ్, యాక్షన్.. ఎంత పాపులర్ అయ్యాయో అందరికీ తెలిసిందే. పుష్ప 2లోనూ అదేస్థాయిలో డైలాగ్స్, ఐటం సాంగ్, యాక్షన్ సీన్లు ఉంటాయని చెప్తోంది. డిసెంబర్ 5 నుంచి ప్రేక్షకులకు మాస్ ఫీస్టేనని పేర్కొంటున్నది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్