బ్రాండ్ అన్నిసార్లు వర్కౌట్ అవ్వదు. సీక్వెల్ కూడా. అయినా కథ బాగుంటే సిగ్గుల్ వర్కవుట్ అవుతుంది కానీ బ్రాండ్ నేమ్ తో కాదు. ఇంత చిన్న లాజిక్ మిస్ అయిపోయాడు పూరి జగన్నాథ్.
బ్రాండ్ అన్నిసార్లు వర్కౌట్ అవ్వదు. సీక్వెల్ కూడా. అయినా కథ బాగుంటే సిగ్గుల్ వర్కవుట్ అవుతుంది కానీ బ్రాండ్ నేమ్ తో కాదు. ఇంత చిన్న లాజిక్ మిస్ అయిపోయాడు పూరి జగన్నాథ్. ఐదేళ్ల కింద ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ ఎనర్జీ, పాటలు తప్ప సినిమా నార్మల్. మళ్లీ అదే కథను సేమ్ టెంప్లేట్ లో వేసుకుని డబుల్ ఇస్మార్ట్ తీశాడు పూరీ. సంబంధం లేని సన్నివేశాలు, కామెడీ కోసం రాసిన ట్రాక్ లు. హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్. ఇవన్నీ చూస్తుంటే పూరీలోని రైటర్ ఇంత దిగజారిపోయాడా అని బాధనిపించింది. అలీ ట్రాక్ అయితే మరీ దారుణం. కథకు సంబంధమే లేని కామెడీ కానీ కామెడీ ఇది. ఫస్టాఫ్, సెకండాఫ్ అని తేడా లేదు. రెండూ రెండే.. దొందు దొందే. చాలావరకు సీన్స్ ల్యాగ్ అనిపించాయి. ఇస్మార్ట్ శంకర్ లో కనీసం కొన్ని కామెడీ సీన్స్ తో పాటు, పాటలు బాగుంటాయి. ఇందులో అలా గుర్తు పెట్టుకోవడానికి ఒక్క సీన్ కూడా లేదు.
ఏదో ఒక సినిమా చేయాలి అన్నట్టు చేసాడే కానీ కాన్సట్రేట్ చేసి తీసినట్టు ఎక్కడా అనిపించలేదు. రామ్ మరోసారి ఎనర్జీ చూపించాడు. కష్టపడ్డాడు. సంజయ్ దత్ జస్ట్ ఓకే. కావ్య తాపర్ పూర్తిగా గ్లామర్ కే పరిమితమైంది. పూరి జగన్నాథ్ గురించి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎలాంటి దర్శకుడు ఎలా అయిపోయాడో అనే బాధ తప్ప.
ఓవరాల్ గా డబుల్ ఇస్మార్ట్.. నచ్చలేదు.. ఎక్కలేదు..
సమీక్షకుడు : ప్రవీణ్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టు