Darling Review : ప్రియదర్శి నభానటేష్ డార్లింగ్ సినిమా ఎలా ఉందంటే..

Darling Review : కొన్నిసార్లు కథను కన్ఫ్యూజన్ డామినేట్ చేస్తుంటుంది. డార్లింగ్ సినిమా విషయంలో ఇదే జరిగింది. కథ క్లారిటీగానే రాసుకున్నా.. స్క్రీన్ ప్లేతో సినిమా ఎటెటో వెళ్లిపోయింది.

darling movie review

ప్రతీకాత్మక చిత్రం

కొన్నిసార్లు కథను కన్ఫ్యూజన్ డామినేట్ చేస్తుంటుంది. డార్లింగ్ సినిమా విషయంలో ఇదే జరిగింది. కథ క్లారిటీగానే రాసుకున్నా.. స్క్రీన్ ప్లేతో సినిమా ఎటెటో వెళ్లిపోయింది. మొదలవ్వడం బాగానే ఉన్నా.. పోను పోను ఎటు పోతుందో అర్థం కాలేదు. కన్ఫ్యూజన్ పరాకాష్టకు చేరిపోయి టైమ్‌లో ఏ సీన్ ఎందుకొస్తుందో కూడా అర్థం కాకుండా తయారైంది కథ. సమాజంలో అమ్మాయి ఫేస్ చేస్తున్న సమస్యల గురించి చెప్పాలనుకున్నాడు దర్శకుడు అశ్విన్ రామ్. దానికోసమే హీరోయిన్‌కు స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ పెట్టాడని అర్థమవుతుంది. కానీ ఆమెకు ఎందుకు అలాంటి సమస్య వచ్చిందో క్లారిటీగా చెప్పలేకపోయాడు. సీరియస్ సీన్స్ కూడా కామెడీ చేసి.. కథను కలగాపులగం చేసాడు అశ్విన్ రామ్. ఫస్టాఫ్ వరకు కాస్తో కూస్తో ట్రాక్‌లోనే ఉంది డార్లింగ్. అక్కడక్కడా నవ్వులు కూడా బాగానే పండాయి.
కానీ కీలకమైన సెకండాఫ్ మాత్రం పూర్తిగా ట్రాక్ తప్పింది. మరీ ముఖ్యంగా నభా నటేష్ కారెక్టరైజేషన్ కన్ఫ్యూజన్‌కు పరాకాష్ట. కొంతవరకు బాగానే అనిపించినా మల్టిపుల్ డిజార్డర్ అనేసరికి క్లారిటీ మిస్ అయింది. అన్ని కారెక్టర్స్ ఆమెలోకి ఎందుకొచ్చాయి? హీరో చిన్న మాట చెప్పగానే ఎందుకు వెళ్లిపోతాయి? ఆ సమస్య వెనక ఉన్న బలమైన కారణాలు కన్విన్సింగ్‌గా చెప్పలేకపోయాడు దర్శకుడు. ప్రియదర్శి తన వరకు చాలా ప్రయత్నించాడు సినిమాను కాపాడటానికి. మనోడి కామెడీ టైమింగ్, డైలాగ్స్ చాలా బాగున్నాయి. నభా నటేష్ గురించి ఏం చెప్పాలో తెలియట్లేదు.. బాగా చేసిందో, యాక్టింగ్ డోస్ ఎక్కువైందో అర్థం కాలేదు. అశ్విన్ రామ్ స్క్రీన్ ప్లే టూ మచ్ కన్ఫ్యూజన్.
ఓవరాల్‌గా డార్లింగ్.. ఇట్స్ బోరింగ్..!
సమీక్షకుడు : వడ్ల ప్రవీణ్ కుమార్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టు

సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్