బెట్టింగ్ జోలికి వెళ్లకండి: ప్రకాశ్‌రాజ్

బెట్టింగ్ జోలికి వెళ్లకండి: ప్రకాశ్‌రాజ్

prakash raj advice to youth  avoid betting ap

ప్రకాష్ రాజ్ 

బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఈడీ ముందు విచారణకు హాజరయ్యి.. తమ వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రంగంలోకి సీఐడీ దిగింది. అందులో భాగంగానే నిన్న విజయ్ దేవరకొండ సీఐడీ విచారణకు హాజరు కాగా.. బుధవారం ప్రకాష్ రాజ్ హాజరయ్యారు. సీఐడీ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన బెట్టింగ్ యాప్స్ పై అలాగే సీఐడీ విచారించిన పలు అంశాలపై.. అధికారులు అడిగిన ప్రశ్నలకు ప్రకాష్ రాజ్ ఏ విధంగా సమాధానమిచ్చారు ఇలా పలు విషయాలపై స్పందించారు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. "అధికారులు నోటీసులు ఇచ్చిన విధంగానే మనం సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యాను. బెట్టింగ్ యాప్స్ తో జరిపిన బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా గతంలోనే సమర్పించాను. 2016లో బెట్టింగ్ యాప్ కి ప్రమోట్ చేశాను. అయితే నేను ప్రమోట్ చేసిన యాప్ ను 2017 లో నిషేధించారు. దయచేసి బెట్టింగ్ యాప్స్ ఎవరు వాడకండి. యువత ఈ బెట్టింగ్ యాప్ జోలికి అసలే వెళ్లకండి .ముఖ్యంగా అడ్డదారిలో వెళ్ళకండి. తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే కదా. ఈ బెట్టింగ్ యాప్ నిర్వహకులకు సంబంధించిన సమాచారాన్ని నేను సిఐడి విచారణలో అందించాను. అయితే నేను ప్రమోట్ చేసిన యాప్ మొదట గేమింగ్ యాప్ అనుకొని ప్రమోట్ చేసాము. కానీ బెట్టింగ్ యాప్ అనుకొని తర్వాత దానిని వదిలేసాను. ఇతర కంపెనీలకు ఎక్కడా కూడా నేను ఇలా ప్రమోషన్ చేయలేదు. దయచేసి బెట్టింగ్ యాప్స్ ఎవరూ కూడా ఉపయోగించకండి. డబ్బులు పెట్టి అసలు బెట్టింగ్ చేయకండి. ప్రజలు, యంగ్ స్టార్స్ కచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టుబడిగా పెట్టి ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇది చాలా అత్యంత దారుణమైన పరిస్థితి దయచేసి ఎవరూ కూడా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయకండి" అని పేర్కొన్నాడు.


భారత్‌-దక్షిణాఫ్రికా టెస్టుకు భారీ భద్రత
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్