ప్రభాస్ హను రాఘవపూడి హిస్టారికల్ మువీ ప్రారంభం.. కొత్త హీరోయిన్‌కు లక్కీ చాన్స్

కల్కితో హిట్టు కొట్టిన రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా ప్రారంభం అవుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడి, మైత్రీ మువీ మేకర్ ఆధ్వర్యంలో వస్తున్న పాన్ ఇండియా సినిమాను శనివారం ప్రారంభించారు.

prabhas imanvi

ప్రభాస్ హను రాఘవపూడి కొత్త చిత్రం ప్రారంభం

హైదరాబాద్, ఈవార్తలు : కల్కితో హిట్టు కొట్టిన రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా ప్రారంభం అవుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడి, మైత్రీ మువీ మేకర్ ఆధ్వర్యంలో వస్తున్న పాన్ ఇండియా సినిమాను శనివారం ప్రారంభించారు. హిస్టారికల్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ అందించబోతున్నట్లు సినిమా నిర్వాహకులు తెలిపారు. డైరెక్టర్ హను రాఘవపూడి ఈ సినిమా కోసం 1940 నాటి పవర్‌ఫుల్ వారియర్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారట. ప్రభాస్ సరసన ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇమాన్వి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ప్రముఖ నటులు మిథున్ చక్రవర్తి, జయప్రద ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించనున్నారు.

అత్యంత భారీ బడ్జెట్‌, హై ప్రొడక్షన్ వాల్యూస్, వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తెరకెక్కనున్న ఈ సినిమాను నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. సుదీప్ ఛటర్జీ ఐఎస్‌సీ డీవోపీగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. రామకృష్ణ - మోనికా ప్రొడక్షన్ డిజైన్‌ను నిర్వహిస్తుండగా, ఎడిటర్‌గా కోటగిరి వెంకటేశ్వరరావును తీసుకున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్