దాని కోసం ఏ స్థాయికైనా దిగజారుతుంది.. పవిత్ర నరేశ్ పెళ్లిపై ఆమె మాజీ భర్త కామెంట్స్

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||పవిత్ర నరేశ్ పెళ్లి||


పవిత్ర లోకేష్, నరేష్ మార్చి 10న పెళ్లి వీడియోను షేర్ చేస్తూ తమ వైవాహిక జీవితానికి మీ ఆశీస్సులు కావాలంటూ పోస్ట్ చేశారు. గత కొంతకాలం నుండి వీరిద్దరి వార్తలు సోషల్ మీడియాలోనూ, ప్రధాన వార్తల్లోనూ చెక్కర్లు కొడుతూనే ఉన్నాయి. 2023  ఆంగ్ల సంవత్సరం సందర్భంగా తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ లిప్ లాక్ వీడియోలు షేర్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ పెళ్లి వీడియో ప్రమోషన్ లో భాగమా లేదా నిజంగానే పెళ్లి చేసుకుని వీడియోని షేర్ చేశారా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే వీరిద్దరికీ ఇప్పటికే వేరే వాళ్లతో పెళ్లిళ్లు అయ్యాయి. నరేష్ కి ఇది నాలుగవ పెళ్లి కాగా, పవిత్ర లోకేష్ కు ఇది మూడవ పెళ్లి. అయితే పవిత్ర మొదటగా ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని పెళ్లి చేసుకుంది. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఏదో కారణాలవల్ల అతనితో విడాకులు తీసుకుంది. కన్నడ నటుడు సుచేంద్ర ప్రసాదును రెండో వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. తర్వాత సుచేంద్ర పవిత్రలకు మనస్పర్ధలు రావడంతో విడాకులు ఇచ్చింది.

అయితే మార్చి 10న నరేష్ షేర్ చేసిన వీడియోపై కన్నడ నటుడు సుచేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటి వరకే ఇద్దరిని మోసం చేసి ఇప్పుడు నరేష్ ను కూడా మోసం చేయబోతుంది పవిత్ర అంటూ ఓ మీడియా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. పవిత్ర లగ్జరీ లైఫ్ కోసమే నరేష్ తో లవ్ స్టోరీ నడిపిస్తుంది. ఈ విషయం త్వరలోనే నరేష్ కు అర్థం అవుతుంది. నరేష్ కి 1500 కోట్ల రూపాయిలు విలువ చేసే ఆస్తులు ఉండటంవల్లే పక్క ప్లాన్ తో నరేష్ తో ఈ ట్రాక్ నడుపుతుందని, ఒకవేళ తన ఆస్తిలో పవిత్రను భాగస్వామి చెయ్యకపోతే ఇంకొకరికి వల వేయడానికి పవిత్ర సిద్ధపడుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్