O Pilaga Venkati Song | ఓ పిలగా వెంకటి సాంగ్.. 9 నెలల్లో 25 కోట్ల వ్యూస్..

ప్రేక్షకుల మన్ననలు పొందిన ఫోక్ సాంగ్‌లో ‘‘ఓ పిలగా వెంకటేషు’’ సాంగ్ సంచలనం సృష్టించింది. యూట్యూబ్‌లో చేరి సరిగ్గా నేటితో 9 నెలలు పూర్తి చేసుకున్న ఈ పాట.. 25 కోట్ల వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది.

o pilaga venkati song pooja nageshwar
ఓ పిలగా వెంకటి సాంగ్

ఈవార్తలు, సినిమా న్యూస్: తెలంగాణ ఫోక్ సాంగ్స్ అంటేనే ఓ ఊపు.. అందులోనూ అమ్మాయి, అబ్బాయి లవ్ స్టోరీ లాంటి కథకు వీక్షకులు బ్రహ్మరథం పడతారు. అలా ప్రేక్షకుల మన్ననలు పొందిన ఫోక్ సాంగ్‌లో ‘‘ఓ పిలగా వెంకటేషు’’ సాంగ్ సంచలనం సృష్టించింది. యూట్యూబ్‌లో చేరి సరిగ్గా నేటితో 9 నెలలు పూర్తి చేసుకున్న ఈ పాట.. 25 కోట్ల వ్యూస్‌కు చేరువలో ఉంది. గొప్ప గొప్ప సాంగ్స్ కూడా వేవ్ తగ్గగానే చతికిలపడతాయి. కానీ.. ఓ పిలగా వెంకటి సాంగ్ మాత్రం ఇప్పటికీ యూట్యూబ్‌లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం ఇండియాలోనే టాప్ మ్యూజిక్ వీడియోల్లో 43వ స్థానంలో నిలిచింది. భవ్య ట్యూన్స్ నిర్మాణంలో వచ్చిన ఈ సాంగ్‌లో పూజా నాగేశ్వర్ డ్యాన్స్, అందంతో మెప్పించింది. ఆమెకు జంటగా రౌడీ హరీశ్ కూడా డ్యాన్స్‌తో ఇరగదీశాడు. వెంకట్ అజ్మీరా సంగీత దర్శకుడిగా, ప్రభ లిరిక్స్ అండ్ సింగర్‌గా వచ్చిన ఈ సాంగ్‌కు శేఖర్ వైరస్ కొరియోగ్రఫీ అందించారు.

ఈ పాట యూట్యూబ్‌లో విడుదలై 9 నెలలు కావొస్తున్న సందర్భంగా ప్రొడ్యూసర్ బాలు పాలోజీ మాట్లాడుతూ.. త్వరలోనే వీక్షకులకు డీజే ఫీస్ట్ అందించబోతున్నామని వెల్లడించారు. ఓ పిలగా వెంకటి సాంగ్‌ను డీజే వెర్షన్‌లో సరికొత్తగా, ఊపు వచ్చేలా తీసుకొస్తున్నామని తెలిపారు. ఆ డీజే సాంగ్‌లో ఆట సందీప్, జ్యోతిరాజ్ కాంబోలో వస్తోందని చెప్పారు. ఆ డీజే సాంగ్‌కు నమ్రిత్ కొరియోగ్రఫీ అందించబోతున్నారు. ఇక, ఓ పిలగా వెంకటి సాంగ్‌ను ఆదరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. పల్లెల్లో చిన్న పిల్లల దగ్గరి నుంచి పండు ముసలివాళ్ల వరకు అంతా.. ఈ సాంగ్ విని కాళ్లు కదిపారని.. అదే తాము సాధించిన గొప్ప విజయం అని సంతోషం వ్యక్తం చేశారు. నార్త్ ఇండియాలోనూ ఓ పిలగా వెంకటి సాంగ్ దుమ్ములేపిందని వివరించారు. తమిళ్ వెర్షన్‌లో విడుదల చేసిన సాంగ్‌కు కూడా ఆదరణ లభించిందని, అందుకు తమిళ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని గొప్ప ఫోక్ సాంగ్స్ అందించేందుకు బూస్ట్ ఇచ్చారని పేర్కొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్