||ఉగాది మరుసటి రోజు ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్ ప్రారంభం||
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఉగాది మరుసటి రోజున షూటింగ్ మొదలు పెడుతున్నట్లు సినీ బృందం ప్రకటించింది. ఈ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా, ఎన్టీఆర్ తో పోటీపడేందుకు విలన్‌గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటించబోతున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ముహూర్తానికి ఊహించని అతిధులు వస్తున్నట్లు సమాచారం.
సినిమాకు అనిరుద్ సంగీత దర్శకత్వం అందిస్తున్నారు. ఈ వేడుకలో విలన్ గా నటిస్తున్న బాలీవుడ్ నటుడు, రాజమౌళి, కీరవాణి,రామ్ చరణ్ వస్తారనే సమాచారం హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా నిర్మాత కళ్యాణ్ రామ్, తమ్ముడు తో పాటు సందడి చేయనునున్నారు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ మార్చి 23 కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు.