NTR Devara Movie Review | ఎన్టీఆర్ దేవర సినిమా ఎలా ఉందంటే..

ఎంత పెద్ద సినిమా అయినా ఎమోషన్ అనేది ఒకటుంటుంది. అది వర్కవుట్ అయితే కథను కూడా పెద్దగా పట్టించుకోరు ఆడియన్స్. అదే ఎమోషన్ మిస్ ఫైర్ అయితే.. కథ అద్భుతంగా ఉన్నా కనెక్ట్ అవ్వడం కష్టమే. దేవర విషయంలో అనిపించింది ఇదే.

devara movie review

దేవర Photo: Facebook

ఎంత పెద్ద సినిమా అయినా ఎమోషన్ అనేది ఒకటుంటుంది. అది వర్కవుట్ అయితే కథను కూడా పెద్దగా పట్టించుకోరు ఆడియన్స్. అదే ఎమోషన్ మిస్ ఫైర్ అయితే.. కథ అద్భుతంగా ఉన్నా కనెక్ట్ అవ్వడం కష్టమే. దేవర విషయంలో అనిపించింది ఇదే. బతికేంత ధైర్యం చాలు.. చంపేంత వద్దు.. భయం ప్రతీ మనిషికి ఉండాలి. ఇదే దేవరలో కొరటాల శివ చెప్పాలనుకున్న లైన్. ఒకప్పటి కొరటాల అయితే.. ఈ లైన్ ఇంకా బాగా చెప్పేవాడేమో..? కానీ దేవరలో ఆ పాత కొరటాల శివ మిస్సయాడనిపించింది. మిర్చిలా హై మూవెంట్స్ లేవు.. శ్రీమంతుడులా మ్యాజిక్ కనిపించలేదు. జనతా గ్యారేజ్‌లో కనబడ్డ ఎమోషన్ ఇందులో లేదు. తొలి 20 నిమిషాలు అదిరిపోయింది.. కానీ ఇంటర్వెల్ వరకు చప్పగా సాగింది. మళ్లీ ఇంటర్వెల్ సీక్వెన్స్ అంతా పూనకాలు పుట్టించాడు కొరటాల. సెకండాఫ్ రెండో కారెక్టర్ ఎంట్రీ ఇవ్వగానే కథ కామెడీ ట్రాక్ ఎక్కింది. జాన్వీ కపూర్ ఉంది కాబట్టి పాటొచ్చింది.. కాంబినేషన్ సీన్స్ వచ్చాయంతే.

అరే ఇది భలే ఉందిరా సీన్.. అదిరిపోయింది.. అనిపించే సీన్స్ అరుదు. స్లో నెరేషన్‌కు తోడు.. 3 గంటల నిడివి.. ఫ్లాట్ స్క్రీన్ ప్లే దేవరకు మైనస్. అండర్ వాటర్ సీక్వెన్సులు అదిరిపోయాయి. క్లైమాక్స్ 20 నిమిషాలు బాగుంది. సెకండ్ పార్ట్‌కు లీడ్ ఇచ్చే సన్నివేశం బాహుబలిలో కట్టప్ప సీన్ గుర్తు చేస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ అదరగొట్టాడు. దేవర, వర రెండు పాత్రల్లోనూ ఇరగదీసాడు. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా బాగున్నాడు. మిగిలిన వాళ్లంతా ఓకే. జాన్వీ కపూర్ స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ. ఉన్నంతలో గ్లామర్ షో చేసింది. కొరటాల శివ కథ బాగా రాసుకున్నాడు కానీ స్క్రీన్‌పైకి వచ్చేసరికి వర్కవుట్ కాలేదనిపించింది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సముద్రంతో సహా పెద్ద ప్రపంచమే సృష్టించాడు. కానీ కీలకమైన ఎమోషన్ విషయంలో మిస్ ఫైర్ అయ్యింది దేవర. అనిరుధ్ కూడా దేవరకు పెద్దగా హెల్ప్ కాలేదు.

ఓవరాల్‌గా దేవర.. ఫ్యాన్స్‌కు నచ్చొచ్చు కానీ కామన్ ఆడియన్స్‌కు కష్టమే..!

సమీక్షకుడు: ప్రవీణ్ కుమార్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టు


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్