మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్‌పై అందరి ఫోకస్ ఉంటే ఆయ్ అంటూ వచ్చి కలెక్షన్లు అన్నీ పట్టుకెళ్లేలా ఉంది ‘ఆయ్’.
ఆయ్ సినిమా రివ్యూ
రెండు కోతులు కొట్లాడుకుంటే మధ్యలో సైలెంట్‌గా పిల్లి వచ్చి రొట్టెముక్క లాక్కెళ్లిపోయిందంట. ఈ కథ గుర్తుందా.. ఈ ఆగస్ట్ 15కి ఇదే జరిగేలా కనిపిస్తుందిప్పుడు. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్‌పై అందరి ఫోకస్ ఉంటే ఆయ్ అంటూ వచ్చి కలెక్షన్లు అన్నీ పట్టుకెళ్లేలా ఉంది ‘ఆయ్’. ఇదేం సూపర్ సినిమా కాదు. కొత్త కథేం కాదు. కానీ ఉన్నంతలో బెటర్ సినిమా. అక్కడక్కడా కామెడీ పేలిన సినిమా. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్ హిలేరియస్‌గా వర్కవుట్ అయ్యాయి. జాతిరత్నాలు తరహాలోనే కథ ఉండదు. కామెడీ తప్ప. సెకండాఫ్‌లోనూ అక్కడక్కడా నవ్వులు బాగానే కురిసాయి. కథ కంటే కామెడీ ఎపిసోడ్స్‌పై ఫోకస్ చేసాడు దర్శకుడు అంజి. ఈ కామెడీతోనే అండర్ కరెంట్‌గా కులం టాపిక్ తీసుకొచ్చాడు. కులం చుట్టూనే ఈ కథను రాసుకున్నాడు.
చివర్లో అదే కులానికి ముడిపెట్టి చిన్న ట్విస్టుతో రెగ్యులర్ ఎండింగ్ ఇచ్చారు. నార్నె నితిన్ బాగున్నాడు. బాగా నటించాడు కూడా. హీరోయిన్ నయన్ సారిక ఓకే. హీరో ఫ్రెండ్స్ అంకిత్ కొయ్య, కసిరెడ్డి కామెడీ అదిరిపోయింది. అదే మేజర్ ప్లస్ పాయింట్. ఈ సినిమాకు మరో హైలైట్ సంగీతం. బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. దర్శకుడు అంజి కామెడీ సినిమా చేసినా కులం లాంటి రిస్కీ టాపిక్ టచ్ చేసాడు.
ఓవరాల్‌గా ఆయ్.. కామెడీ పర్లేదండోయ్..
సమీక్షకుడు : ప్రవీణ్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టు