ఫెమినా మిస్ ఇండియా Femina Miss India 2024 కిరీటాన్ని నిఖిత పోర్వాల్ Nikita Porwal సొంతం చేసుకుంది. ముంబైలో జరిగిన ఫేమస్ స్టూడియోస్ ఈవెంట్‌లో ఆమె అందాల సుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది.
మిస్ ఇండియాగా నిఖిత పోర్వాల్
Miss India 2024 | ఫెమినా మిస్ ఇండియా Femina Miss India 2024 కిరీటాన్ని నిఖిత పోర్వాల్ Nikita Porwal సొంతం చేసుకుంది. ముంబైలో జరిగిన ఫేమస్ స్టూడియోస్ ఈవెంట్‌లో ఆమె అందాల సుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన నిఖిత పోర్వాల్.. మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించనుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేను ఎంజాయ్ చేస్తున్న ఆనందాన్ని వర్ణించతరం కాదు. అసలు దీన్ని నమ్మలేకపోతున్నా. నా తల్లిదండ్రుల కండ్లలో ఆనందం కనిపిస్తోంది. ఇందుకు గర్విస్తున్నా. నా ప్రయాణం ఇకనుంచి మొదలైంది. అనేక విజయాలు సాధించాలి అని వెల్లడించింది. గత ఏడాది మిస్ ఇండియాగా నిలిచిన నందిని గుప్తా.. నిఖిత పోర్వాల్‌కు కిరీటాన్ని అలంకరింపజేసింది. అటు.. రేఖా పాండే (దాద్రా నగర్ హవేలీ), ఆయూశీ దోలకియా (గుజరాత్) తొలి, రెండో రన్నరప్‌గా నిలిచారు.