Saripodha Shanivaram Review | ముక్కలు ముక్కలుగా చూస్తే ఇది కూడా బాగానే ఉందే.. సరిపోదా శనివారం చూసిన తర్వాత అనిపించిన ఫీలింగ్ ఇదే.
సరిపోదా శనివారం సినిమా రివ్యూ Photo: Facebook
ముక్కలు ముక్కలుగా చూస్తే ఇది కూడా బాగానే ఉందే.. సరిపోదా శనివారం చూసిన తర్వాత అనిపించిన ఫీలింగ్ ఇదే. బహుశా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని జోనర్ మాస్ ఒక్కటేనేమో..? జరిగే కథేంటో తెలుసు. ఏం జరగబోతుందో కూడా తెలుసు. అయినా కూడా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉందంటే దర్శకుడిలో విషయం ఉన్నట్లేగా..! సరిపోదా శనివారం చూస్తుంటే వివేక్ ఆత్రేయపై ఈ ఫీలే వచ్చింది. రొటీన్ కథ తీసుకున్నా.. శ్రీరామ్, ఎవడు లాంటి రిఫరెన్సులు కనిపించినా చాలా వరకు బోర్ కొట్టకుండా కమర్షియల్ సినిమా చూపించాడు వివేక్. దానికి నాని, సూర్య తోడయ్యేసరికి మాస్ ఆడియన్స్‌కు సినిమా సరిగ్గా సరిపోయింది. ఫస్ట్ 15 నిమిషాల్లోనే సినిమా కథ అంతా పూస గుచ్చినట్లు చెప్పేసాడు వివేక్ ఆత్రేయ. అక్కడ్నుంచి ఆ కథను ఎలా ముందుకు తీసుకెళ్లాడనేదే సరిపోదా శనివారం. హీరోకు ఒక్కరోజేగా కోపమొచ్చేది.. మిగిలిన రోజులు అతడు కొట్టినోళ్లు తిరిగి కొట్టరా అనే లాజిక్ పట్టుకుంటే డిస్ కనెక్ట్ అయిపోతాం. లాజిక్స్ పట్టించుకోకుండా ప్రాపర్ కమర్షియల్ సినిమా చూస్తున్నాం అనుకుంటే మాత్రం ఈ సరిపోదా శనివారం బాగానే అనిపిస్తుంది.
ఫస్టాఫ్ కాస్త స్లోగా మొదలైనా.. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయింది. నాని, ఎస్‌జే సూర్య ఫేస్ ఆఫ్ మొదలయ్యాక కథలో వేగం పెరుగుతుంది. సెకండాఫ్ చాలా వరకు పరుగులు పెట్టించాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ. కాకపోతే సరిపోదా శనివారంకు ఉన్న మెయిన్ మైనస్ లెంత్. 2 గంటల 51 నిమిషాల నిడివి మెయిన్ విలన్.. కాస్త ట్రిమ్ చేసుంటే బాగుండేదేమో..? ఈ ఫార్మాట్ కథలు కొత్తేం కాదు.. ఒక్క శనివారం కొట్టడం అనే పాయింట్ తప్ప నాని మరోసారి ఇరక్కొట్టాడు.. సినిమాలో యాక్టింగ్.. అలాగే విలన్స్‌ను కూడా. ఎస్‌జే సూర్య మెయిన్ పిల్లర్.. దయ లేని దయా పాత్రకు ప్రాణం పోసాడు. ప్రియాంక మోహన్ పర్లేదు. మిగిలిన వాళ్లలో సాయికుమార్ కారెక్టర్ బాగుంది. సరిపోదా శనివారంకు మరో హీరో ఉన్నాడు.. ఆయనే జేక్స్ బిజాయ్. బ్యాగ్రౌండ్ స్కోర్‌తో థియేటర్స్‌లో బాక్సులు మోతెక్కిపోయాయి.
ఓవరాల్‌గా సరిపోదా శనివారం.. లెంత్ మినహాయిస్తే.. మిగిలింది సరిపోయింది మరి..!
సమీక్షకుడు : ప్రవీణ్ కుమార్ సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టు