Naga Chaitanya - Sobitha Marriage : అక్కినేని నాగచైతన్య శోభిత పెళ్లి వేదిక ఫిక్స్

సమంతతో విడాకుల తర్వాత అక్కినేని నాగచైతన్య రెండో వివాహానికి సిద్ధమయ్యాడు. సహ నటి శోభిత ధూళిపాళ్లను పెళ్లి చేసుకోనున్నాడు. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. వీరిద్దరు డిసెంబర్ 4వ తేదీన ఏడు అడుగులు వేయబోతున్నట్లు, గ్రాండ్‌గా వివాహం చేసుకోబోతున్నట్లు తెలుగు రాష్ట్రాల్లో టాక్ నడుస్తోంది.

chai sobitha

నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల

సమంతతో విడాకుల తర్వాత అక్కినేని నాగచైతన్య రెండో వివాహానికి సిద్ధమయ్యాడు. సహ నటి శోభిత ధూళిపాళ్లను పెళ్లి చేసుకోనున్నాడు. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. వీరిద్దరు డిసెంబర్ 4వ తేదీన ఏడు అడుగులు వేయబోతున్నట్లు, గ్రాండ్‌గా వివాహం చేసుకోబోతున్నట్లు తెలుగు రాష్ట్రాల్లో టాక్ నడుస్తోంది. డిసెంబర్ 2న సంగీత్‌తో మొదలయ్యే వీరి పెళ్లి వేడుక.. 4వ తేదీన పెళ్లి, 10వ తేదీన రిసెప్షన్ జరగనున్నట్లు సమాచారం అందుతోంది. అయితే పెళ్లి ఎక్కడ జరగనుంది? అన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారని తెలిసినా.. తాజా సమాచారం ప్రకారం వీరి పెళ్లి వేదికను నాగార్జున ఫిక్స్ చేసినట్లు తెలిసింది. నాగచైతన్య, శోభిత పెళ్లి వేదికను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే చేయనున్నట్లు సమాచారం.

పెళ్లి ఏర్పాట్లలో భాగంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగార్జున అన్ని ఏర్పాట్లు చేయిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే పనులు కూడా మొదలు పెట్టినట్లు సమాచారం. సెట్టింగ్, డెకోరేషన్ పనులు ముమ్మరంగా సాగుతున్నట్లు టాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందింది. ఈ పెళ్లికి అతి తక్కువ మంది అతిథులను ఆహ్వానించాలని నాగార్జున నిర్ణయించుకున్నట్లు తెలిసింది. రిసెప్షన్‌కు మాత్రం కుటుంబ సభ్యులు, స్నేహితులు, చుట్టాలతో పాటు సినీ, రాజకీయ నాయకులను ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఇప్పటికే పెళ్లి పనుల్లో ఇరు కుటుంబాలు బిజీ అయ్యాయి. పెళ్లి ముందు జరగాల్సిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారు. ఇటీవల వైజాగ్‌లోని శోభిత నివాసంలో పసుపు దంపుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలను శోభిత తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది.

ఇక.. సినిమాల పరంగా చూస్తే నాగచైతన్య తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. శోభిత నటించిన లవ్ సితార సినిమా ఈ మధ్యే విడుదలైంది. ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్