Nagachaitanya shobitha Dhulipala: గ్రాండ్ గా నాగచైతన్య, శోభిత ఎంగేజ్ మెంట్..ఫోటోస్ వైరల్

టాలీవుడ్ హీరో నాగచైతన్య, నటి శోభితా ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఫోటోలను అక్కినేని నాగార్జున ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

naga chaithanya shobitha engagement

naga chaithanya shobitha engagement

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశారు. నా కుమారుడు నాగచైతన్య, శోభితా ఈరోజు ఉదయం 9.42గంటలకు నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవడం  చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబంలోకి ఆమెను సంతోషంగా ఆహ్వానిస్తున్నాము. నూతన జంటకు నా అభినందనలు..వీరి జీవితం సంతోషంగా, ప్రేమతో ఉండాలని కోరుకుంటున్నాను. 8.8.8 అనంతమైన ప్రేమకు నాంది అంటూ నాగార్జున పేర్కొన్నారు. నాగార్జున పోస్టుపై పలువురు నెటిజన్లు స్పందించారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. 

కాగా నాగచైతన్యకు గతంలో హీరోయిన్ సమంతో వివాహం జరిగిన విషయం తెలిసిందే. కానీ వారిద్దరు వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. చైతు, శోభిత ఎంతో కాలంగా మంచి స్నేహితులుగా ఉన్నారు.కాగా శోభిత ధూళిపాళ్ల 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. 2016లో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శోభిత..ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ తోపాటు హాలీవుడ్ లోనూ వరుస ఛాన్సులను అందుకుంటున్నారు.ఇక నాగచైతన్య తండేల్ మూవీతో బిజీగా ఉన్నారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్