టాలీవుడ్ స్టార్ హీరో, నాగార్జున తనయుడు నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్లకు ఎంగేజ్ మెంట్ జరగనుంది. కొద్దిమంది సన్నిహితుల సమక్షంలోనే ఈ వేడుక జరగనున్నట్లు సమాచారం.
Naga chaitanya
టాలీవుడ్ హీరో నాగచైతన్య..ప్రముఖ నటి శోభిత ధూళిపాళ్లకు ఎంగేజ్ మెంట్ జరగనున్నట్లు నెట్టింట్లో వార్తలు తెగచక్కర్లు కొడుతున్నాయి. హీరో నాగచైతన్య ఇంట్లో కొంతమంది సమక్షంలోనే ఈ జంట నేడు ఆగస్టు 8 గురువారం నిశ్చితార్థంతో ఒక్కటవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అక్కినేని కుటుంబం నుంచి అధికారిక ప్రకటన గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొంతమంది నెటిజన్లు విషేస్స్ చెబుతున్నారు.
కాగా శోభిత ధూళిపాళ్ల 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. 2016లో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శోభిత..ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ తోపాటు హాలీవుడ్ లోనూ వరుస ఛాన్సులను అందుకుంటున్నారు.ఇక నాగచైతన్య తండేల్ మూవీతో బిజీగా ఉన్నారు.