Thandel Movie Review | నాగచైతన్య సాయిపల్లవి తండేల్ మువీ రివ్యూ

చాలా రోజులు అయిపోయింది ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూసి. తండేల్తో మొత్తంగా కాదు గాని ఒక మోస్తరుగా ఆ లోటు తీరిపోయింది. 9 నెలలు సముద్రంలో.. 3 నెలలు ఇంటి దగ్గర ఉండే జాలర్ల కథ ఇది.

thandel movie review

తండేల్ సినిమా రివ్యూ

చాలా రోజులు అయిపోయింది ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూసి. తండేల్తో మొత్తంగా కాదు గాని ఒక మోస్తరుగా ఆ లోటు తీరిపోయింది. 9 నెలలు సముద్రంలో.. 3 నెలలు ఇంటి దగ్గర ఉండే జాలర్ల కథ ఇది. కొన్ని రోజులుగా దర్శక నిర్మాతలు కథ మళ్ళీ మళ్ళీ చెప్పడం మూలానో ఏమో కానీ సినిమా చూస్తున్నపుడు ఎగ్సైటింగ్ గా అనిపించలేదు. తొలి 45 నిమిషాలు బాగా నెమ్మదిగా కథ సాగుతుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి.. తండేల్ బాగా స్పీడ్ అందుకుంది. నాగ చైతన్య అండ్ బ్యాచ్ పాకిస్తాన్ కు దొరికిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. సెకండ్ హాఫ్ ఆసక్తికరంగా తెరకెక్కించాడు దర్శకుడు చందు మొండేటి. హీరో గ్యాంగ్ పాకిస్తాన్ జైల్లో ఉన్నప్పుడు సాయి పల్లవిపై వచ్చే సీన్స్ అన్నీ బాగున్నాయి. చైతు, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. సినిమా మొత్తం వీళ్ళ ప్రేమ కథ మీదే వెళ్తుంది.క్లైమాక్స్ అరగంట కథను చాలా మలుపులు తిప్పాడు దర్శకుడు.

ఆర్టికల్ 370 ఇష్యూ కూడా ఈ కథకు చాలా బాగా వాడుకున్నాడు. సాయి పల్లవి ఎప్పటిలాగే మాయ చేసింది. ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే చైతు చాలా సన్నివేశాలు పల్లవిని సైతం డామినేట్ చేశాడు. కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టాడు నాగ చైతన్య. తండేల్ సినిమాకు మెయిన్ హీరో దేవీ శ్రీ ప్రసాద్. చాలా రోజులు.. కాదు కాదు చాలా ఏళ్ల తర్వాత పర్ఫెక్ట్ డ్యూటీ ఎక్కాడు. సినిమా అంతా DSP బిజిఎం చెవుల్లో రీ సౌండింగ్ వస్తూనే ఉంటుంది. దర్శకుడు చందు మొండేటి ఈ కథకు తన వరకు అయినంత న్యాయం చేశాడు.

ఓవరాల్ గా తండేల్.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ.. DSP కోసం చూసేయొచ్చు.

సమీక్షకుడు: ప్రవీణ్ కుమార్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టు


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్